Sex with minor wife is rape, rules SC సుప్రీం సంచలన తీర్పు.. ‘‘బలవంతమే కాదు శృంగారమూ నేరమే’’

Sex with wife below 18 is rape says supreme court

SC, Supreme Court, rape, sex, sexual intercourse, minor wife, sex with minor wife rape, landmark judgment, consent, seveour punishments, crime, child trafficking, marital rape, consensual sex

The Supreme Court, in a landmark judgment said that sexual intercourse with a minor wife is rape. The court struck down Exception 2 to Section 375 of the Indian Penal Code, which exempts marital rape of girls between the age of 15 and 18 from the purview of rape.

సుప్రీం సంచలన తీర్పు.. ‘‘బలవంతమే కాదు శృంగారమూ నేరమే’’

Posted: 10/11/2017 01:19 PM IST
Sex with wife below 18 is rape says supreme court

హిందూ వివాహ బంధాన్ని పరిగణలోకి తీసుకుని, వైవాహి వ్యవస్థ దెబ్బతినకుండా మారిటల్ రేప్ విషయంలో కేంద్రం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. మైనర్ బాలిక విషయంలో మాత్రం సంచలన తీర్పును వెలువరించింది. బాల్యవివాహాలను నిరోధించే క్రమంలో.. పద్దెనిమిదేళ్లు నిండని బాలికలతో వారి భర్తలు బలవంతంగా అత్యాచారాలకు పాల్పడితే అది ఖచ్చితంగా మారిటల్ రేప్ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ వయస్సు లోపు వివాహితలతో భర్తలు శృంగారం చేసినా అది కూడా నేరమనే తీర్పును వెలువరించింది.

వివాహిత మైనర్ అయినా భర్తతో శృంగారంలో పాల్గోన్నా.. లేక భర్త బలవంతం చేసినా.. దానిని పెద్ద నేరంగా పరిగణించలేమని, ఇలాంటి చర్యల ద్వారా భారత వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదముందని గతంలో పేర్కోన్న దేశసర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఇదే అంశంపై మరో తీర్పును వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పుకు పూర్తి భిన్నంగా తీర్పును వెలువరిస్తూ తమ అభిప్రాయాన్ని మార్చుకుంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తికి సెక్షన్ 375 ప్రకారం మినహాయింపులు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ విషయంలో కేంద్రం తక్షణం స్పందించి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరింది.

కాగా, మైనర్లు కాని వివాహితలపై వారి భర్తలు సాగిస్తున్న బలవంతపు శృంగారాలపై మారిటల్ రేప్ లపై మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దేశంలో 2.3 కోట్ల బాల్య వివాహాలు ఉండగా, వాటిని రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్, 18 ఏళ్లు నిండని భార్యపై జరిపే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షించే అంశంపై చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles