Rahul's Jibe on Lack of Women in RSS ఆరెస్సెస్ మహిళలపై రాహుల్ కామెంట్లు.. తిప్పికొట్టిన బీజేపి

Rahul s jibe on lack of women in rss provocative but well meaning

RSS, Rahul Gandhi, Gujarat, RSS women wing, RSS women wing Drill, RSS women wing shorts, gujarat assembly elections, congress, BJP, Anandiben Patel, nation news, political news, politics

“Ever seen women in shorts at RSS shakhas?” A well-intentioned, albeit provocative comment by Congress Vice President Rahul Gandhi backfired as it sparked outrage from the BJP.

ఆరెస్సెస్ మహిళలపై రాహుల్ కామెంట్లు.. తిప్పికొట్టిన బీజేపి

Posted: 10/11/2017 11:06 AM IST
Rahul s jibe on lack of women in rss provocative but well meaning

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే వున్నాడు. కాగా అవకాశం దొరికినప్పుడల్లా బీజేపి, దాని అనుబంధ అరెస్సెస్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. రాహల్ గాంధీ చేసినవి వివాదాస్పద వ్యాఖ్యలని భావిస్తున్న బీజేపి.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇంతకీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలేమిటంటే..

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని మహిళలపై వివక్ష కొనసాగుతోందని.. అరెస్సెస్ లో కేవలం పురుషాధిక్య సమాజం మాదిరిగానే తయారైన వ్యవస్థ తప్ప.. మహిళాలకు సమానత్వం. సాధికారత దిశగా ఏర్పడింది కాదని వ్యాఖ్యనించారు. అరెస్సెస్ లో మహిళా కార్యకర్తలు ఎప్పుడు పురుషుల మాదిరిగా సమావేశాలకు హాజరైందికానీ, వారిలో ఖాకీ నెక్కర్లు వేసుకుని డ్రిల్ చేసింది కానీ తాను చూడలేదని విమర్శించారు. ఆరెస్సెస్ కార్యకర్తలు నిక్కర్లు ధరిస్తారని, కానీ ఆ సంస్థలోని మహిళలకు మాత్రం అ అవకాశం లేదని వాపోయారు.

మహిళలు నోరు తెరవడాన్ని బీజేపీ, ఆరెస్సెస్ అంగీకరించవని, వారు మౌనంగా ఉండాలనే కోరుకుంటాయని ఆరోపించారు. వారి నోళ్లు మూయించేందుకు ఆ రెండూ పరుగులు తీస్తుంటాయన్నాయని విమర్శించారు. గుజరాత్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళా సాధికారితపై దృష్టిసారిస్తామని హామిఇచ్చారు. మహిళా, బాలికల విద్య, ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకుంటామన్నారు. మీకేం కావాలో మోదీ ఎప్పుడైనా మాట్లాడారా? అని రాహుల్ ప్రశ్నించారు. కాగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను పలువరు బీజేపి నేతలు వక్రబాష్యం చెప్పగా, గుజరాత్ మాజీ సీఎం అనందిబెన్ పటేల్ మాత్రం ఖండించారు.

అరెస్సెస్ లోని మహిళలను కూడా నెక్కర్లపై చూడాలన్న రాహుల్ అలోచనలు ఆయన వక్రబుద్దిని స్పష్టం చేస్తున్నాయని పలువురు బీజేపి నేతలు ఫైర్ అయ్యారు. కాగా అనందిబెన్ పటేల్ మాత్రం అరెస్సెస్ లో మహిళా విభాగం కూడా వుందని అన్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ గాంధీకి తగిన పరిపక్వతం లేకపోవడంతో ఆయన అరెస్సెస్ పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RSS  Rahul Gandhi  Gujarat  RSS women wing  Anandiben Patel  gujarat assembly elections  congress  BJP  

Other Articles