Congress, BJP slugfest over a report on Amit Shah's son ప్రధాని జై షా కంపెనీపై విచారణ జరిపించేనా..?

Jay shah to file rs 100 crore criminal defamation suit against the wire

amit shah, jay shah, amit shah son, amit shah son company, jay shah, jay shah company, temple enterprise, amit shah son scam, amit shah son scandal, amit sha son controversy, bjp, congress, aap, cbi, modi, anti-corruption, PM modi, anna hazare

The Congress alleged that a company run by Amit Shah's son Jay Shah posted a turnover of Rs 80.5 crore, an increase of 16,000 times in the year following BJP winning the 2014 elections.

అవినీతి వ్యతిరేక ప్రధాని జై షా కంపెనీపై విచారణ జరిపించేనా..?

Posted: 10/09/2017 10:15 AM IST
Jay shah to file rs 100 crore criminal defamation suit against the wire

తన పరువుకు భంగం కలిగించి.. తన ప్రతిష్టకు దెబ్బతీసేలా తప్పుడు వార్త ప్రచురించిన ‘ది వైర్’ అనే వెబ్ సైట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించినట్లుగానే తప్పుడు కథనం ప్రచురించిందన్న అభియోగాలను మోపుతూ సదరు సంస్థపై పరువునష్టం దావా వేశారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్ ను ఉంటంకిస్తూ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనం నేపథ్యంలో విపక్షాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు 'జే' సంస్థపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.

జే డైరెక్టర్ గా ఉన్న టెంపుల్ ఎంటర్ ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవరు 2014-15లో రూ.15 వేలు ఉండగా 2015-16 నాటికి అది ఏకంగా 16 వేల రెట్లు పెరిగి రూ.80.5 కోట్లకు చేరుకుందని కథనంలో పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నాథ్వాని బంధువైన రాజేష్ ఖండ్వాలా నుంచి కంపెనీకి రూ.15.78 కోట్ల రుణం అందిందని, ఖండ్వాలా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉన్నారని పేర్కొంది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగిన విపక్షాలు జే కంపెనీపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి.

దీంతో స్పందించిన జే  ఆ వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు. తన కంపెనీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చారు. తనను అప్రతిష్ఠ పాలు చేసే ఉద్దేశంతోనే వార్త ప్రచురించారని ఆరోపించారు. తన వ్యాపారం విజయవంతం కావడం వెనక తన తండ్రి రాజకీయ పలుకుబడి ఉందనే అపోహలకు తావిచ్చేలా ఉందని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యాపారం చేస్తున్నానని, ట్యాక్స్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు.

 కాగా, జే షా నిర్వహిస్తున్న కంపెనీ టర్నోవర్ ఒక్కసారిగా రూ.80.5 కోట్లకు చేరుకున్నట్టు వార్తలు రావడంతో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పందించారు. అధికారం వచ్చిన తర్వాత కొందరి అదృష్టం మారిపోతుంటుందని వ్యాఖ్యానించారు. ఇవే ఆరోపణలు ప్రతిపక్షంపై వస్తే అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంటుందని అన్నారు. ప్రధాన మంత్రి నిత్యం వల్లేవేసే విధంగా తాను నిజమైన అవినీతి వ్యతిరేక వ్యక్తి అయితే.. అవినీతిని సహించని నేత అయితే తక్షణం జై సంస్థపై సిబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఏ స్టాక్ లేని సంస్థ, ఏ నిల్వలు లేని పరిశ్రమ, ఇన్వెంటరీలు, అస్తులు లేని ఎంటర్ ప్రైజ్ ఒక్క ఏడాదిలో ఏకంగా రూ.80 కోట్ల రూపాయల లాభాన్ని ఎలా అర్జిస్తుందని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ఇది కూడా క్రోనీ కాపిటలిజమని దుయ్యబట్టారు. దేశంలో విపక్ష పార్టీలపై వచ్చే అరోఫణల నేపథ్యంలో తక్షణం స్పందించే ప్రధాని మోదీ ఈ అరోపణలపై కూడా స్పందిస్తారా..? సిబిఐ విచారణ జరిపిస్తారా..? అరెస్టులు చేయిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ అవినీతి కేసుల్లో మరోటి చేరిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  jay shah  amit shah son scam  bjp  congress  aap  cbi  modi  anti-corruption  PM modi  anna hazare  

Other Articles