Court issues arrest warrant against actor Hero హీరో అరెస్టు చేయాలని కోర్టు అదేశాలు.. వారెంటు జారీ..

Court issues arrest warrant against actor hero

actor Jai sampath, drunk driving case, absconding, IV metropolitan magistrate, arrest warrant, Adyar, Tamil actor, kollywood news, breaking news, latest news

A non-bailable warrant has been issued against Tamil actor Jai after he failed to appear before a court in a drunk-driving case.

హీరో అరెస్టు చేయాలని కోర్టు అదేశాలు.. వారెంటు జారీ..

Posted: 10/07/2017 11:44 AM IST
Court issues arrest warrant against actor hero

ప్రముఖ సినీనటుడ్ని అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపర్చాలని చెన్నై సైదాపేట కోర్టు మేజిస్ట్రేట్‌ అదేశాలు ఇస్తూ నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంటు జారీ చేశారు. కాలీవుడ్ కు చెందిన నటుడు జై సంపత్ పై ఈ మేరకు న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది. గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొన్నారు. దీనిపై ఆ ప్రాంత ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో తన తప్పును అంగీకరించిన జై ఈనెల 3న కోర్టుకు హాజరైయ్యారు. అయితే తదరుపరి వాయిదాను గురువారానికి వాయిదా వేసింది. అయితే గురువారం నటుడు జై కోర్టుకు హాజరుకాలేదు. కేసు విచారణకు రావడంతో గురువారం న్యాయమూర్తి జస్టిస్ అబ్రహంలింకన్ ముందకు వచ్చింది. అయితే నటుడు కేసుకు హాజరుకాకపోవడంతో నటుడిపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం కోర్టులో నటుడ్ని హాజరుపర్చాలని పోలీసులను అదేశించింది.

నటుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసినా శుక్రవారం కూడా జై పోలీసులకు లభించకపోవడంతో వారు అతన్ని అరెస్టు చేయలేదు.. కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనూ లేదు. జై అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో జైని రెండు రోజుల్లో అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశ పెట్టాల్సిందిగా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. జర్నీ, రాజారాణీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా జై సుపరిచితుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles