Brit Paramedic Speaks in Punjabi Video goes viral | పంజాబీలో తాగుబోతును మ్యానేజ్ చేసిన ఫారినర్

Brit paramedic speaks in punjabi

Britain, Paramedic, Justin, Punjabi Video, Indian Drunk Scam, Viral Video, Foreigner Punjab Language, Punjabi Viral Video

Brit Paramedic Who Used His Punjabi Skills To Console A Drunk Indian. Brit Paramedic Justin Speaks in Punjabi goes viral.

ITEMVIDEOS: పంజాబీ భాషలో ఫారినర్ ఏం చేశాడంటే...

Posted: 10/05/2017 05:28 PM IST
Brit paramedic speaks in punjabi

మాములుగానే విదేశీయులు భార‌తీయ భాష‌ల్లో మాట్లాడితే చాలా వింత‌గా అనిపిస్తుంది. మొన్నీమధ్యే ఇండియాలో యూఎస్ ఎంబసీ ప్రతినిధులు బాలీవుడ్ అడిషన్ పేరిట ఓ వీడియో అప్ లోడ్ చేయగా.. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది అలా కాదు. బాగా తాగేసి రోడ్డు మీద పడిపోయిన ఓ ఓ పంజాబీ భార‌తీయుడిని ఓ బ్రిటన్ వైద్యుడు ఎలా సముదాయించాడో చూడండి.

వృత్తి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఆల్క‌హాల్ ఓవ‌ర్‌డోస్‌తో ఇబ్బంది ప‌డుతున్న వ్య‌క్తిని అత‌డు కూల్ చేసిన విధానాన్ని నెటిజ‌న్లు తెగ‌పొగిడేస్తున్నారు. పంజాబీ వ్య‌క్తి మ‌త్తు ఎక్కువై కింద ప‌డిపోయాడ‌ని అక్క‌డి పారామెడిక‌ల్ సిబ్బందికి ఎవ‌రో కాల్ చేశారు. హుటాహుటిన వారు అక్క‌డికి వ‌చ్చి ఆ వ్య‌క్తి చికిత్స చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆల్క‌హాల్ ఎక్కువగా తాగ‌డంతో మొద‌ట పంజాబీ వ్య‌క్తి స‌హ‌క‌రించ‌లేదు. త‌ర్వాత జ‌స్టిన్ పంజాబీలో మాట్లాడగానే ఆ వ్య‌క్తి ఆనంద ప‌డ్డాడు. ఒక డ్యాన్స‌ర్‌ని పొగ‌డ‌టం కోసం తాను పంజాబీ నేర్చుకున్నాన‌ని జ‌స్టిన్ చెప్ప‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

ప్రాథ‌మిక చికిత్స చేయ‌డం కోసం అక్కడికి వచ్చిన ఆ వైద్యుడు పంజాబీ మాట్లాడిన విధానం చూస్తే మెచ్చుకోకుండా ఉండ‌లేం. చికిత్స చేస్తూ బ్రిట‌న్ వైద్యుడు జ‌స్టిన్ పంజాబీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles