woman cuts off lover genitals in kerala మర్మాంగాలను కోసి ప్రియుడిపై ప్రతీకారం..

Woman chopped off lover genitals in kerala

Special Marriages Act,private hospital in Kozhikode,Kuttippuram Town in the district,genitals chopped off by a woman,genitals chopped, crime

A 26-year-old man underwent an emergency surgery at a private hospital in Kozhikode after his genitals were allegedly chopped off by a woman.

వంచన చేసిన ప్రియుడిపై ప్రతీకారం.. జననంగాలను..

Posted: 09/22/2017 12:46 PM IST
Woman chopped off lover genitals in kerala

కేరళలో ఆ మధ్య తనతో గడపాలని అదేశించిన ఓ కామాంద సన్యాసికి.. వాడి జననంగాన్ని కోసి ఓ యువతి వార్తల్లో నిలిచిన విషయం వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు కూడా అదే అయుధాన్ని అస్త్రంగా మార్చుకున్న ఓ మహిళ.. తనను వంచించిన ప్రియుడిని అదే తరహాలో శిక్షించి బుద్ది చెప్పి వార్తలో నిలిచింది. తన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడన్న సమాచరం అందుకన్న మహిళ.. అతడ్ని ప్రణాళిక వేసి ఓ లాడ్జికి పిలిచి.. అక్కడకు చేరుకోగానే చిన్న కత్తితో అతని మర్మాంగనాన్ని కోసి పడేసింది. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా కుట్టిపురంలో జరిగింది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుట్టిపురానికి చెందిన మహిళ భర్త మరణించిడంతో వితంతువుగా బతుకునీడుస్తుంది. అయితే అమెకు ప్రేమపాఠాలను చెబుతూ యువకుడు అమెకు దెగ్గరయ్యాడు. వారిద్దరి పరిచయం ప్రణయానికి దారితీసింది. అంతటితో అగని యువకుడు అమెను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇలా సుమారు రెండున్నరేళ్లు గడిచింది. అయితే గత కొంతకాలంగా యువకుడు మహిళను పట్టించుకోవడం లేదు. కాగా వేరే వివాహాన్ని చేసుకునేందుకు తన ప్రియుడు సిద్దమవుతున్నాడని మహిళకు సమాచారం అందింది.

దీంతో తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు అర్థాంతరంగా మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతున్నాడన్న అక్రోశంలో అమె ఓ ప్లాన్ చేసింది. అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది. తనలా మరో మహిళా.. యువకుల చేతిలో సర్వస్వం కోల్పోకూడదని.. అలా చేయాలంటే కూడా యువకులు భయపడాలని అందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలవాలని భావించింది. అంతే తాను వేసుకున్న ప్రణాళికను అమలు చేసింది.

తన ప్రియుడికి ఫోన్ చేసి.. 'నీతో మాట్లాడాలి, రా' అంటూ తీసుకువెళ్లింది. కుట్టిపురంలో ఒక లాడ్జ్ లో వీరిద్దరూ దిగారు. లాడ్జ్ లో దిగిన కాసేపటికే వారిద్దరూ దిగిన రూం నుంచి గట్టిగా అరుపులు రావడంతో లాడ్జ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంతలో తీవ్ర రక్తస్రావంతో గిలగిలలాడుతూ యువకుడు రూం బయటపడి ఉండడంతో అతనిని ఆసుపత్రికి తరలించిన లాడ్జ్ సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడడంతో అతని మర్మాంగం కోసేశానని సదరు యువతి పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతిని రిమాండ్ కు తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles