Ajay Singh to take control of NDTV with majority stake: బీజేపి చేతికి ఎన్డీటీవి.. చక్రం తిప్పనున్న అజయ్ సింగ్

Spicejet s ajay singh to take control of ndtv with majority stake

Business, SpiceJet, Radhika Roy, NDTV, Ajay Singh, Prannoy Roy, CBI raids NDTV, SpiceJet NDTV, NDTV takeover, Ajay Singh SpiceJet, latest news

The owner and co-founder of SpiceJet, Ajay Singh, is set to take control of NDTV as he has bought a majority stake in the news channel,

బీజేపి చేతికి ఎన్డీటీవి.. చక్రం తిప్పనున్న అజయ్ సింగ్

Posted: 09/22/2017 11:22 AM IST
Spicejet s ajay singh to take control of ndtv with majority stake

కేంద్రంలో ఎవరి ప్రభుత్వం అధికారంలో వుంటూ దేశంలో వారి పెత్తనం నడుస్తుందన్నది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. ఒక వేళ అలా కాని పక్షంటో కేంద్ర సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా చెప్పుకునే అధికార పంజరంలోని చిలుకలుగా మారాయని స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించిన సంస్థలూ రంగంలోకి దిగి.. కేంద్రంలోని అధికార పార్టీకి దేశంలోని అన్ని పరిస్థితులు అనుకూలంగా మార్చేవిధంగా చర్యలు తీసుకుంటాయి. దారి రప్పించుకుంటాయి.

సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తి.. నిజాలను బహిర్గతం చేస్తున్న ఎన్డీటీవి.. ఇక బీజేపి చేతికి వెళ్లినట్టే. దీంతో ఇక ఆ ఛానెల్ లో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రసారం కావని ఓ జాతీయ మాద్యమ సంస్థ కథనం వెల్లడించింది. బడ్జెట్ క్యారీయర్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ యజమాని, సహ వ్యవస్థాపకులైన అజయ్ సింగ్ ఎన్డీటీవీలో సుమారు రూ. 600 కోట్ల పెట్టుబడులను పెట్టిన నేపథ్యంలో ఇక ఎన్డీటీవీ ఆయన చేతికి వెళ్లినట్లే.

అయితే స్పైస్ జెట్ చేతికి వెళ్లిన ఎన్డీటీవీ. బీజేపికి ఎలా సొంతం అవుతుందనేగా మీ సందేహం.? అక్కడికే వస్తున్నాం. గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ప్రచార బృందానికి అజయ్ సింగ్ నేతృత్వం వహించారు. గత ఎన్నికలలో దేశవ్యాప్తంగా నమో మంత్రం.. మోడీ మానియా అంటూ నినాదాలతో పాటు అబ్ కి బార్, మోదీ సర్కార్ అన్న నినాదాన్ని కూడా ప్రజల్లోకి ఉదృతంగా తీసుకువెళ్లిన వ్యక్తులలో అజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని సమాచారం.

దీంతో ఇక ఎన్డీటీవీతో పాటుగా ఎడిటోరియల్ హక్కులను కూడా అజయ్ సింగ్ సొంత చేసుకున్నట్లేననని, ఈ మేరకు అనధికార వర్గాలు తమకు సమాచారం అందించాయని జాతీయ మాద్యమ సంస్థ వెల్లడించింది. కాగా స్పైస్ జెట్ కు చెందిన ఓ అధికారి మాత్రం ఈ కథనం సత్యదూరమైందని, నిరాధరమైందని తోసిపుచ్చారు. మరికొన్ని రోజులు అగితే ఏది సత్యమో మనకే తెలిసిపోతుంది కదూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles