Tollywood Top Director Meet AP CM over New Capital Designs | అమరావతి కోసం రంగంలోకి దిగిన జక్కన్న.. బాబుతో భేటీ.. లండన్ టూర్ కి రెడీ!

Rajamouli meets cm chandrababu naidu

SS Rajamouli, Chandrababu Naidu, Chandrababu Rajamouli, Rajamouli Meet Chandrababu, Rajamouli Amaravati Design, rajamouli Chandrababu Press Meet, Rajamouli AP Capital Design, Amaravati Designs, Rajamouli London AP Capital, Rajamouli about Amaravati Designs

SS Rajamouli Meets CM Chandrababu Naidu Over AP Capital Design. AP Government Consider Baahubali Director's Suggestions on Amaravati Construction.Rajamouli says meet afternoon again.

ITEMVIDEOS:బాబుతో జక్కన్న భేటీ.. డిజైన్ల పరిశీలన

Posted: 09/20/2017 09:00 AM IST
Rajamouli meets cm chandrababu naidu

తెలుగు చలన చిత్రాల అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. బుధవారం హైదరాబాదు నుంచి అమరావతి వెళ్లిన రాజమౌళి నేరుగా సీఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బాబుతో భేటీ అయ్యారు.

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యతలను సీఎం చంద్రబాబు రాజమౌళికి అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి నారాయణ, సీఆర్డీఏ డైరెక్టర్ శ్రీధర్ లు హైదరాబాదులో రాజమౌళిని కలిసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రితో భేటీలో అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాలు, వాటి ఆకృతులపై చర్చించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ ప్రతినిధులు, నిపుణులతో రాజమౌళిని లండన్ కు పంపించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అక్కడ భారీ భవంతుల నిర్మాణాలు, కట్టడాలను పరిశీలించనున్నారు.

 

కాగా, అమరావతిలో నిర్మించనున్న భవనాల రూపకల్పనలో రాజమౌళి సలహాలు ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకగా, సినిమా సెట్లలా తాత్కాలికంగా నిర్మిస్తారా అంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక రాజధాని బాధ్యతలను చేపట్టిన రాజమౌళి తన తదుపరి చిత్రం మొదలుపెట్టేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

 

ప్రస్తుతానికి అంతే.. రాజమౌళి

అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తనకు లభించిన ఓ మంచి అవకాశమని రాజమౌళి వ్యాఖ్యానించారు. భేటీ అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడారు. రాజధాని ఆకృతులు ఎలా ఉండాలన్న విషయంలో సీఎం తన మదిలోని ఆలోచనలను పంచుకున్నారని, ఆయన దూరదృష్టి తనకెంతో నచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతానికైతే ప్రాథమిక ఆకృతులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సుకు వెళ్లాల్సి వున్నందున, తాము మరోసారి మధ్యాహ్నం కలుస్తామని రాజమౌళి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles