Fed up with wife, man punches ACP to be jailed ఏసీపీపై పంచ్: జైలుకు పంపించమంటే.. కౌన్సిలింగ్ చేస్తారా..?

Man punches acp for counselling and not sending to jail

man beats cop, man punches ACP, Man Punches police officer, man beats cop for not sending to jail, man beats cop for counselling, yogesh goliya, Shipra Path police station, mukesh choudhary yadav, Choudhary, ACP, Rajasthan, Crime

Fed up with his wife and her daily barbs, a 34-year-old man punched an assistant commissioner of police (ACP) inside a police station in Jaipur so that he could be 'granted' his wish to be jailed.

ఏసీపీపై పంచ్: జైలుకు పంపించమంటే.. కౌన్సిలింగ్ చేస్తారా..?

Posted: 09/09/2017 01:28 PM IST
Man punches acp for counselling and not sending to jail

గతిలేకపోయినా పర్వాలేదు కానీ.. సంస్కార జీవితంలో మాత్రం భార్యభర్తల మధ్య శృతి తప్పనిసరి అని అంటారు పెద్దలు. అది లేకపోతే.. ఆ సంసారం నిత్య నరకాన్ని తలపిస్తుందని కూడా చెబుతారు. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కోన్నాడో ఏమె తెలియదు కానీ రాజస్థాన్‌ లోని జయపురలో నివాసముండే ఓ వ్యక్తి తన భార్యను చావచితక బాది.. ఆపై పోలిస్ స్టేషన్ కు చేరుకుని తనను జైలుకు పంపించాలని కోరాడు. అంతటితో అగకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారిపైనే చేయి చేసుకుని.. తనను జైలుకు పంపమంటే హితోక్తులు చెబుతారేంటని ప్రశ్నించాడు.

ఈ చిత్రమైన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. జయపురలో యోగేష్ గోల్యా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. భార్యతో వాగ్వాదం నేపథ్యంలో ఆమెను చితక్కొట్టిన ఆయన..నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి... ‘నా భార్యను కొట్టాను. నేను జైలుకు వెళ్లాలి. నన్ను అరెస్టు చేయండి’ అని పోలీసులను కోరాడు. ఇంతలో అతని చేతిలో దాడికి గురైన ఆయన భార్య కూడా అతనిపై కేసు పెట్టేందుకు స్టేషన్ కు చేరుకుంది.

దీంతో వివాదం అర్ధం చేసుకున్న ఏసీపీ దేష్ రాజ్ యాదవ్ వారిద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో తాను తన భార్యతో వేగలేనని ఎంత మొత్తుకుంటున్నా పోలీసు అధికారులు సర్థిచెప్పి సంసార జీవితాన్ని కంటిన్యూ చేయాలని చెప్పడంతో ఒళ్లు మండిపోయిన భర్త.. జైలుకి పంపమంటే సర్దిచెబుతావా? అంటూ ఏసీపీపై పంచులు కురిపించాడు. అతని ముఖం పగిలేలా కొట్టాడు. దీంతో జైలుకి వెళ్లాలన్న అతని కోరికను పోలీసులు వెంటనే తీర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yogesh goliya  Shipra Path police station  mukesh choudhary yadav  Choudhary  ACP  Rajasthan  Crime  

Other Articles