Hero Vijay Says VH.. Thathayya Chill.! వీహెచ్ ను ఛిల్ అవ్వాలంటూ హీరో మెసేజ్

Arjun reddy s lip lock doesn t go well with vh hero says thathayya chill

Hanumantha Rao, Vijay Devarakonda, Vijay Deverakonda VH, Thathayya chill, hero Vijay in Arjun Reddy, Arjun Reddy movie, V. Hanumanth Rao, hero Vijay on VH, Tollywood, Entertainment

Vijay Devarakonda's latest flick 'Arjun Reddy' is creating a buzz with passionate lip-lock and bold content, the ad of the film seems to have not gone down well with Congress leader V. Hanumanth Rao.

వీహెచ్ ను ఛిల్ అవ్వాలంటూ హీరో మెసేజ్

Posted: 08/22/2017 10:14 AM IST
Arjun reddy s lip lock doesn t go well with vh hero says thathayya chill

దేశంలో యువత సన్మార్గంలో నడవాలి.. దేశ స్వతంత్ర సమరయోధుల అశయాలకు అనుగూణంగా వ్వవహరించాలని అని ప్రతి నాయకుడు ఆయా నాయకుల జన్మదినం రోజునో లేక వర్థంతి రోజునో యువతకు పిలుపునిస్తుంటారు. అయితే నిత్యం తాము ఎదుర్కొంటున్న అంశాలలో మాత్రం చెడు ఎంతగా వున్నా దానిని అసలు పట్టించుకోరు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు అందుకు భిన్నం. తన నిర్మోహమాట.. కుండ బద్దలు కొట్టే తత్వంతో.. ఆయన ముక్కుసూటిగానే నడిస్తారు. యువత కూడా ఆ మార్గాల్లోనే నడవాలని యోచిస్తుంటారు.

ఇలా ఆయనకు తారసపడిన ఓ అర్టీసీ బస్సుపై అంటించిన సినిమా పోస్టర్‌ అసభ్యకరంగా ఉండటంతో.. బస్సు ఆపించి మరీ చించేశారు. ఇలాంటి పోస్టుర్లతో బస్సులు రోడ్లపై తిరుగుతుంటే.. యువత దానిని చూస్తూ వక్రమార్గంలోకి ఎందుకు పయనించదని అనుకున్నారో ఏమో తెలియదు కానీ నాంపల్లిలోని గాంధీ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న ఆయన ఓ ఆర్టీసీ బస్సు మీద నటుడు విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఓ అసభ్యకరమైన పోస్టర్ ను ఆయన గమనించారు.

దాంతో ఆయన వెంటనే బస్సు ఆపించి కండక్టర్‌ సాయంతో పోస్టర్‌ను తొలగించేశారు. ఇలాంటివి యువతను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని ఈ సందర్భంగా వీహెచ్‌ పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలిసిన చిత్ర సినీహీరో విజయ్ దేవరకొండ విభిన్నంగా స్పందించాడు.సామాజిక మాద్యమ దిగ్గజం ఫేస్ బుక్ ద్వారా విహెచ్ కు మెసేజ్ పంపాడు. ఏమనో తెలుసా.. చిల్ తాతయ్యా. దీనికి మరి హీరో తాతయ్య ఎలా ఫీలవుతారో.. ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VH  V Hanmanth Rao  Vijay Devarakonda  Thathayya  tollywood  entertainment  

Other Articles

Today on Telugu Wishesh