woman staff saree pulled by senior in five star hotel ఢిల్లీ స్టార్ హోటల్ లో కీచకపర్వం.. చీరను లాగిన దుశ్యాసనుడు

Delhi five star hotel security manager caught assaulting woman staff

Delhi Hotel employee assaulted, Hotel Employee Molested, CCTV Footage, Pawan Dahia, five star hotel, security manager, guest relation staff, sexual assault, molestation, delhi crime, crime

An executive at a five-star hotel in Delhi is seen pulling at an employee's Sari and dragging her to him in an aggressive act of sexual harassment caught on CCTV camera.

ఢిల్లీ స్టార్ హోటల్ లో కీచక పర్వం.. చీరను లాగిన దుశ్యాసనుడు

Posted: 08/18/2017 01:34 PM IST
Delhi five star hotel security manager caught assaulting woman staff

దేశ రాజధాని ఢిల్లీలో దేశ ప్రజలకు అందించిన తాజా సిసిటీవీ ఫూటేజీ.. యావత్ దేశ మహిళల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. దేశరాజధానిలో నేరుగా కేంద్రం అదుపాజ్ఞనలలోనే వుండే శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో మహిళల పరిస్థితిని, మరీ ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల భద్రతను కళ్లకు కట్టినట్టగా బయటపెడుతుంది. దేశరాజధానిలోనే నిర్భయ ఘటన చోటుచేసుకున్న తరువాత దేశవ్యాప్తంగా అలాంటి అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్ వెళ్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహిళ పర్యాటకులకు అయా దేశాలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయంటే పరిస్థితి ఎంతలా విషమించిందో ఇట్టే అర్థమవుతుంది.

బీహార్ లో అర్జేడీ అధినేత కుమారుడు కృష్ణుడి వేషాన్ని వేస్తే దానిని తిలకించి అయనతో జరిగిన భేటీలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోడీ.. దేశంలో అడపడచులపై జరుగుతున్న దారుణాలను వీక్షించడం లేదా..? వీక్షిస్తే.. ఈ దారుణాలను అపేందుకు ఎలాంటి చర్యలను తీసుకురానున్నారు..? ఇంకెన్నాళ్లు మహిళలు ఈ తరహా బాధలను అనుభవించాలి. పార్లమెంటులో మూడింట రెండుంతుల మెజారిటీ వున్న ఈ తరహా దాడులకు పాల్పడే వారిపై వేగంగా నేరనిర్ధారణ, కఠిన శిక్షలు తీసుకురావడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తాజాగా ఓ ఫైవ్‌ స్టార్ హోటల్ లో ఇటు స్టాప్ అటు గెస్టులకు భద్రత కల్పించాల్సిన అధికారే.. ఓ మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడి కీచకపర్వానికి తెరలేపాడు. సెక్యూరిటీ మేనేజర్‌ పవన్ దహియా మహిళా ఉద్యోగిని చీర పట్టుకుని దుశ్యాసనుడిలా లాగాడు. సిసిటీవీ లేదనుకుని అతగాడు చేసిన పని.. ఆ దృశ్యాలు బయటపడటంతో దేశరాజధానిలోనే కీచకపర్వం అంటూ ఈ వీడియోలోని సిసిటీవీ ఫూటేజి దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ ఎరోసిటీ హోటల్ లో చోటుచేసుకుంది.
 
గత నెల (జూలై) 29న ఆ మహిళా ఉద్యోగిని పుట్టినరోజు కావటంతో సెక్యూరిటీ మేనేజర్‌ పవన్ దహియా అమెను హోటల్‌ లోని తన రూంకి పిలిచాడు. అమెకు తన జన్మదినం సందర్భంగా చక్కని బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని కూడా ప్రలోభాలకు గురిచేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్కసారిగా చీర లాగటం ప్రారంభించాడు. ప్రతిఘటించిన ఆమె పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత భయంతో బయటకు వచ్చేసిన ఆమె ఘటనపై హెచ్ఆర్‌ డిపార్టుమెంట్ లో ఫిర్యాదు చేసింది. అయితే అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని సమాచారం.
 
తాను రెండేళ్లుగా అదే హోటల్ లో పని చేస్తున్నానని, అయితే చేరిన తరువాత నుంచి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ పవన్ తనపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడని బాదితురాలు చెప్పింది. తన పుట్టిన రోజున కూడా గదిలోకి పిలిచిన పవన్ దాహియా తన చీర లాగాలని యత్నించాడని.. దీనిని పక్కనే ఉన్న మరో వ్యక్తి చూస్తూనే ఉన్నాడని కూడా చెప్పింది. అయితే అతను మౌనంగా నిల్చున్నాడే తప్ప స్పందించలేదని.. దీంతో తానే పవన్ దాహియాను అడ్డుకున్నానని చెప్పింది.

ఇక పవన్ దాహియాపై పిర్యాదు చేసేందుకు సీసీ పుటేజీ వీడియోలను ఓ అధికారిణికి చూపించానని అయితే అమె అతన్ని పిలిచి మందలించి.. వార్నింగ్ లెటర్ రాయించుకుని వదిలేసారే తప్ప.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. అయితే ఏకంగా సెక్యూరిటీ అధికారిపై పిర్యాదు చేస్తావా అంటూ తనను మాత్రం ఉద్యోగం నుంచి తీసేశారని మహిళ వాపోయింది. హోటల్‌ పీఆర్‌ అధికారి రాజా సింగ్ ఘటనపై స్పందిస్తూ సెక్యూరిటీ మేనేజర్ ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh