explosion near metro rail depo at miyapur మియాపూర్ భారీ పేలుడుకు అదే కారణమా.?

Explosion near metro rail depo at miyapur

explosion at miyapur, miyapur explosion, explosion at Miyapur Dumping Yard, explosion at metro rail depot, Dumping yard, Miyapur, Huge Sound in Miyapur Dumping Yard, Incidnet near Metro Depo, Metro, Hyderabad, Dumping, explosion, dumping yard, metro rail depot, miyapur, buffalo, bomb squad, crime

miyapur residents were scared as an explosion took place at dumping yard, near to yet to start metro rail depot.

ITEMVIDEOS: మియాపూర్ లో విస్పోటనం.. నాటు బాంబు పేలుడు..

Posted: 08/14/2017 02:36 PM IST
Explosion near metro rail depo at miyapur

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో భారీ పేలుడు సంభవించింది. మియాపూర్ డప్పింగ్ యార్డులో ఈ పేలుడు చోటుచుసుకుంది. పెద్ద శబ్దంతో భారీ విస్పోటనం జరగడంతో స్థానికులకు భయాందోళనకు గురయ్యారు. ఈ విస్పోటనం ధాటికి డప్పింగ్ యార్డులో మేత కోసం వెళ్లిన ఓ గేద మరణించింది. పేలుడు వల్ల గేద తల తెగడంతో అది మరణించింది. విస్పోటనం వార్తను అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

భారీ పేలుడు సంభవించిందన్న సమాచారం అందుకోగానే సైబరాబాద్ పోలీసులు బాంబు స్వాడ్ విభాగాన్ని కూడా రంగంలోకి దింపారు. అనునిత్యం జనసామర్థ్యం వుండే మియాపూర్ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ జోరుగా సాగుతుండటంతో రియల్టర్లు.. తమ భూమిలోని బండరాళ్లను తొలగించేందుకు తీసుకువచ్చిన జెలిటిన్ స్టిక్స్ ను చెత్తకుప్పలో పడవేయడంతో ఈ ప్రమాదం సంభించిందా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

పేలింది నాటు బాంబు..?

స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో మియాపూర్ డప్పింగ్ యార్డులో నాటు బాంబు పేలుడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నాటు బాంబును ఎక్కడి నుంచి తీసుకువచ్చారు..? ఎవరు తీసుకువచ్చారు. ఇక్కడికెలా చేరిందన్న అన్న విషయాలపై అరా తీస్తున్నారు. సంఘవిద్రోహ శక్తులు రేపటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భగ్నం చేయడానికి కుట్రపన్నారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. నాటుబాంబు పేలుడును దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ‍్లు, రేల్వేస్టేషన్, బస్‌స్టేషన‍్లలో తనిఖీలు నిర‍్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : explosion  dumping yard  metro rail depot  miyapur  buffalo  bomb squad  crime  

Other Articles