పోలీస్ జంట.. ఫేక్ రికార్డుతో సన్మానం.. ఇప్పుడు జాబ్ ఊస్టింగ్ | Bogus Everest climb Police Couple Ousted

Pune couple everest fraud

Pune Police Couple, Everest Climb Fake, Everest fraud, Pune Police Couple, Dinesh Rathod and Tarkeshwari Rathod, Pune Police Everest Climb Fake, Everest Mountain, Mountain Everest Fraud, Fake record Lost Job

Pune Police Couple Who Faked Mount Everest Feat Dismissed From Force. In June last year, police constable couple from Pune, Dinesh Rathod and Tarkeshwari Rathod, went public with their claim they were the first Indian couple to reach the Mount Everest summit

ఫేక్ రికార్డు.. పోలీస్ జాబ్ ఊడింది

Posted: 08/08/2017 08:38 AM IST
Pune couple everest fraud

చేయని పనిని చేసినట్లు చూపించి అందరినీ మోసం చేసిన ఓ పోలీస్ జంటకు ఊహించని షాక్ ఎదురయ్యింది. వారిద్దరిని తక్షణమే విధుల్లోంచి తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతకీ వారు చేసిన పనేంటంటే.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు ఫేక్ రికార్డ్ క్రియేట్ చేయటమే.

పుణే శివాజీనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పని చేసే దినేశ్ రాథోడ్ అతని భార్య తారకేశ్వరి రాథోడ్ లు గతేడాది జూన్ లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్లు ప్రకటించారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోల, కొంత సమాచారం ను కూడా కూడా నెట్ లో వైరల్ చేసింది. దీంతో మహారాష్ట్ర పోలీస్ శాఖ వారికి ఘనంగా సన్మానం కూడా చేసింది. అయితే ఆ ఫోటోలు చూసిన కొందరు స్థానిక పర్వతారోహకులు అనుమానం వ్యక్తం చేస్తూ నేపాల్ టూరిజం శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో అదంతా అబద్ధం అని తేలటంతో నేపాల్ ప్రభుత్వం వీరిద్దరిని తమ దేశంలోకి ప్రవేశించకుండా పదేళ్ల నిషేధం విధించింది.

ఆ వెంటనే రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు విచారణ ప్రారంభించగా, నవంబర్ లో వారిద్దరిపై సస్పెన్షన్ విధించారు. మూడు నెలల క్రితం విచారణ కమిటీ ముందు హాజరైన ఈ ఖాకీ దంపతులు తమను ఏ ఆధారాలతో సస్పెండ్ చేశారంటూ వాదించారు కూడా. అయితే విచారణలో వాళ్లు తప్పు చేసినట్లు రుజువు కావటంతో ఇప్పుడు విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు పుణే అదనపు పోలీస్ కమిషనర్ సాహెబ్ రావ్ పాటిల్ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pune  Police Couple  Everest Climb  Fake Record  

Other Articles