Venkaiah Naidu elected as 13th Vice-President of India ఫెద్దల సభాపతిగా తెలుగోడు.. 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య

Venkaiah naidu elected as 13th vice president of india

venkaiah naidu, vice-president, gopalkrishna gandhi, bjp, hamid ansari, 13th vice president, new vice president, venkaiah naidu speech, venkaiah naidu swearing in, congress

SENIOR BJP leader and former Union minister M Venkaiah Naidu was on today elected the 15th Vice-President of India.

ఫెద్దల సభాపతిగా తెలుగోడు.. 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య

Posted: 08/05/2017 07:43 PM IST
Venkaiah naidu elected as 13th vice president of india

ఉభయ సభల పార్లమెంటులోని పెద్దల సబకు సభాపతిగా తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. దేశ 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య గెలుపొందారు. ఇవాళ ఉదయం ఉభయసభల పార్లమెంటు సభ్యులు ఓట్ల వేయగా, సాయంత్రం నుంచి ప్రారంభమైన లె్క్కింపులో వెంకయ్య విజయాన్ని సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొతంగా 785 ఓట్లు వుండగా, అందులో కేవలం 771 మంది ఎంపీలు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వెంకయ్యనాయుడుకు అనుకూలంగా 516 మంది పార్లమెంటు సభ్యులు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన గోపాలకృష్ణ గాంధీకి అనుకూలంగా కేవలం244 మంది పార్లమెంటు సభ్యులు మాత్రమే ఓట్లు వేశారు. కాగా 11 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లు చెల్లలేదు. ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీపై వెంకయ్యనాయుడు 272 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకూ పార్లమెంట్ ఆవరణలో ఓటింగ్ సాగిన అనంతరం లెక్కింపు ప్రక్రతియను చేపట్టారు. ఆ తర్వాత వెంకయ్యను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఒక సభ్యుడు రాజ్యసభకు చైర్మన్ గా గెలుపొందడం ఇదే ప్రపథమం. వెంకయ్య గెలుపుతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లాలో కూడా అనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా పంబరాలు జరుగుతున్నాయి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles