Beer Bottles Lorry Slides From Road in Jangaon ముందుబాబుల పండుగకు పోలీసుల అడ్డు.. !

Police stops locals from carrying beer bottles as lorry slides in jangoan

beer load lorry slides at chempak hills, beer load lorry slides in jangoan, beer lorry driver, beer load lorry, slides, chempak hills, jangoan, locals,dangareddy, police, crime

As beer load lorry slides at chempak hills in jangoan district, the local police has taken immediate action by sending driver to hospital for treatment and put police conistables at the spot to stop local carry away beer bottles.

ముందుబాబుల పండుగకు పోలీసుల గంఢీ.. !

Posted: 08/05/2017 01:59 PM IST
Police stops locals from carrying beer bottles as lorry slides in jangoan

జనగాం జిల్లా కేంద్రంతో మందుబాబులు పండగ చేసుకుందామని భావించారు. అయితే మందుబాబుల వ్యూహాలను ఇప్పటికే పలు ఘటనల్లో విన్న, చూసిన పోలీసులు మాత్రం వారి వ్యూహాలను దెబ్బతీశారు. పండగ చేసుకుందామని భావించిన మందుబాబుల అశలు పోలీసుల హుటాహుటి చర్యల ద్వారా పటాపంచలయ్యాయి. ఏదో ఇంట్రెస్టింగ్ గానే వుంది..? కానీ విషయమే బోదపడలేదని అనుకుంటున్నారు కదూ... అయితే అసలు వివరాల్లోకి వెళ్తే..

జనగాం జిల్లాలోని శివారు ప్రాంతమైన చంపక్‌ హిల్స్‌ మీదుగా బీరు సీసాల లోడ్డుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బొల్లా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంలో తీవ్ర గాయలపాలైన లారీ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. 1275 బీరుసీసాలతో సంగారెడ్డి నుంచి జనగాంకు వస్తుండగా చంపక్ హిల్స్ ప్రాంతంలో ఎత్తుపల్లాల వద్ద లారీ ఎక్కలేక మెరాయించడంతో లారీ బొల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఫలితంగా లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు ట్విస్టు వుంది. బీరు సీసాలు ఒకటి రెండు కాదు ఏకంగా 1275 కాటన్ల బీరు సీసాలు ఈ ప్రమాద ఘటనతో రోడ్డు పాలయ్యాయి. అయితే ఘటన జరగ్గానే ఒక్కరిద్దరు బీరుబాటిళ్లను ఎత్తుకెళ్లగా, ఇక స్థానికులెవరూ బీరు సీసాలు వద్దకు వచ్చి ఎత్తుకెళ్లకుండా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటుచేశారు. దీంతో అప్పనంగా వచ్చి బీరును లాగించి పండగ చేసుకుందామని బావించిన మందుబాబుల అశలకు పోలీసులు గండికొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer load lorry  slides  chempak hills  jangoan  locals  sangareddy  police  crime  

Other Articles