5-story building collapses in mumbai, 9 dead ముంబైలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం.. 9మంది మృతి

Mumbai building collapse 9 dead over 50 feared trapped in ghatkopar tragedy

National Disaster Response Force, residential building, Ghatkopar, eastern Mumbai, Lal Bahadur Shastri Marg tragedy, Brihanmumbai Municipal Corporation, former TV anchor, potholes, woman biker, National Highway, mumbai building collapse in ghatkopar, mumbai building collapse in ghatkopar, ghatkopar building collapse, mumbai building collapse, ghatkopar, brihanmumbai municipal corporation, bmc mumbai, bmc

A residential building in Ghatkopar in eastern Mumbai collapsed this morning where more than 30 people are feared to be trapped under the debris.

ముంబైలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం.. 9మంది మృతి

Posted: 07/25/2017 03:00 PM IST
Mumbai building collapse 9 dead over 50 feared trapped in ghatkopar tragedy

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ముంబైలోని ఓ నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో సుమారు 9 మంది సజీవ సమాధి కాగా, మరో 40 మంది శఇధిలాల కింద చిక్కుకున్నారు. బంధువుల రోధనలతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఘాట్ కోపర్‌ ప్రాంతంలో సంభవించిన ఈ ఘటన సమాచారాన్ని అందుకున్న రెస్క్యూ టీమ్ లు రంగంలో కి దిగి శిథిలాల కింద చిక్కుకు్న వారిని రక్షంచే ప్రయత్నం చేస్తున్నారు. కాగా శిధిలాల కింది చిక్కకున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని సమాచారం.

ఉదయం పదిన్నర గంటలకు ఈ ప్రమాధం సంభవించగా, మధ్యాహ్నం వరకు శిథిలాల కింద చిక్కుకున్న 9 మందిని రెస్క్యూ టీమ్ సభ్యులు ర‌క్షించారు. మ‌రో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీయ‌డానికి శ‌త‌విధాలా ప్రయ‌త్నిస్తున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజ‌న్లు వెంటనే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ వ్యాన్, 108 అంబులెన్స్ కూడా వెంట‌నే సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఇవాళ పనిదినం కావడం.. దీంతో ఇళ్లలోని వారు కార్యాలయాలకు, బడులు, కాలేజీలకు వెళ్లిన తరువాత ఈ ప్రమాదం జరగడంతో.. తక్కువ సంఖ్యలోనే బాధితులు చిక్కుకున్నారని తెలుస్తుంది.

భ్రిహన్ ముంబై మున్పిఫల్ కార్పోరేషన్ కంట్రోల్ రూమ్ కు ఉద‌యం 10.43 గంట‌ల‌కు భవ‌నం కుప్పకూలిన‌ట్లు ఫోన్ వ‌చ్చింది. వెంట‌నే స్పందించిన అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చర్యలు చేప‌ట్టారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా మరణించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ముంబై నిర్వహణ బృందానికి సమాచారమిచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక బృందాలే చర్యలు చేపట్టాయి. భవన శిథిలాల కింద 40 నుంచి 50 మంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు.

మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, వృద్ధులే ఉన్నట్లు తెలియవచ్చింది. రెండు వారాల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడం, అది పాత భవనం కావడంవలనే కూలిపోయిందని అధికారులు చెప్పారు. అందులో నివశిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయమని చెప్పినా చేయలేదని అధికారులు తెలిపారు. సుమారు 60 మంది వరకు ఆ భవనంలో ఉంటున్నట్లు సమాచారం. కాగా మరో జాతీయ దినపత్రిక మాత్రం అక్రమంగా నిర్మాణాలను చేపట్టడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానాలను వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai  building collapse  ghatkopar  tragedy  brihanmumbai municipal corporation  bmc  Crime  

Other Articles