పాక్ ప్రధాని దేశభక్తి, రాజీనామాకు డిమాండ్| Satires on Pakistan PM Patriot Allegations

Nawaz sharif sensational allegations on us ex president

Pakistan, PM Nawaz Sharif, Nawaz Sharif Patriot, Nawaz Sharif Bill Clinton, Nawaz Sharif Loyalty, Nawaz Sharif Speech, Nawaz Sharif Not Resignation, Nawaz Sharif Pakistan, Nuclear Tests, US Bribe Pak Nuclear Test

Pakistan PM Nawaz Sharif Alleges Bill Clinton offered $5 billion to not conduct nuclear test in 1998. But, Pak media ignore that. Nawaz want to escape from Panama case, on that he made such allegations.

ప్రధాని దేశభక్తిని అస్సలు పట్టించుకోరా?

Posted: 07/20/2017 09:53 AM IST
Nawaz sharif sensational allegations on us ex president

అణు పరీక్షలతో అగ్రరాజ్యానికి వణుకు పుట్టించేందుకు చిన్న దేశాలు కూడా ఇప్పుడు వెనకాడటం లేదు. అయితే దాయాది భారత్ బలాలను గత దశాబ్దాలుగా అంచనా వేస్తూ వస్తున్న పాక్ మాత్రం ఆ పని ఎప్పుడో చేసింది. 1998 లో ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మిస్సైల్ రారాజు కలాం నేతృత్వంలో పోఖ్రాన్ వద్ద భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పాక్ కూడా అదే పని చేసింది.

అయితే ఆ టైంలో పరీక్షలు నిర్వహించకుండా ఉండాలంటూ అమెరికా ఆయనకు లంచం ఇవ్వజూపిందంట. అణు పరీక్షలు నిర్వహించకుండా వుంటే, తనకు 5 బిలియన్ డాలర్లు ఇస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆఫర్ చేశాడంట. అయితే అయితే తాను దేశానికి అత్యంత విధేయుడిని కావడంతో దానిని తిరస్కరించినట్టు తెలిపారు. ఒకవేళ క్లింటన్ ఆఫర్‌ను కనుక తాను అంగీకరించి ఉంటే పాక్ అణ్వస్త్ర దేశం అయి ఇంత బలంగా ఉండేది కాదన్నాడు.

ప్రధాని చేసిన ఈ సంచలన ఆరోపణలు పాక్ మీడియా అంతగా పట్టించుకోవడం లేదు. పనామా లీకేజీ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న షరీఫ్ అందులోంచి బయటపడేందుకు ఇలా దేశభక్తుడంటూ కలరింగ్ ఇచ్చుకుంటున్నాడంటూ కథనాలతో ఏకీపడేస్తోంది. ప్రస్తుతం ఆయనపై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిటీ విచారణ కొనసాగుతుండగా, షరీఫ్ ఆట ముగిసిందని, రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Nawaz Sharif  Nuclear Tests  

Other Articles