TRS MLA Dharma Reddy Duped By Con Man పరకాల ఎమ్మెల్యేకు కోయదొరల కుచ్చుటోపి

Parkal mla dharma reddy daughter duped of rs 57 lakh by con man

Parkal MLA Dharma Reddy, MLA Dharma Reddy Duped By Con Man, parakal mla, dharma reddy daughter, dharma reddy daughter cheated, manasa reddy cheated by con man, trs mla daughter duped, koya dhoralu, koya dhora, black magic con man, crime

Parkal MLA Dharma Reddy Daughter Duped Of Rs 57 Lakh By Con Man, pooja performed to gain ministry in kcr cabinet.

పరకాల ఎమ్మెల్యే కూతరుకు కోయదొరల కుచ్చుటోపి

Posted: 07/17/2017 07:55 PM IST
Parkal mla dharma reddy daughter duped of rs 57 lakh by con man

మనిషిలో అత్యాశ ఎంతటి పనులకైనా ప్రేరేపిస్తుందనడానికి ఇదే నిదర్శనం. మంత్రాల నేపంతో ఉన్న అభరణాలను రెట్టింపు చేస్తానని ఆశలో పడి లైఫ్ స్టైయిల్ భవన యజమానిని మత్తులో ముంచి దొరకినకాడికి కాసులు తీసుకుని చెక్కేసిన ఘనులను ఉదంతం వెలుగు చూసిన తరువాత ఎంతటి వారైనా ఇకపై అప్రమత్తంగా వుండాలని సంకేతాలను పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే అప్పడప్పుడూ అక్కడక్కడా మంత్రగాళ్ల మాటల గారఢిలో అనేక మంది తాము కస్టించి సంపాదించిన డబ్బును అత్యాశ దూరం చేస్తూనే వున్నాయి.

అయితే తాజాగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కూడా మాటల మాంత్రికులు కుచ్చుటోపి పెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపుకు పాల్పడి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ధర్మారెడ్డికి మంత్రి పదవి దక్కాలంటే.. ప్రత్యేక పూజలు చేయాలని.. అందుకు గాను కొంత ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి ఏకంగా కుచ్చుటోపి పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 లక్షల రూపాయల మేర తమకు తాము కోయదొరలుగా చెప్పుకున్న ఇద్దరు చేతిలో మానస రెడ్డి మోసపోయారు. ఈ వార్త వెలుగుచూడటంతో అది సంచలనంగా మారింది.

మంత్రాల పేరుతో ఇద్దరు కోయదొరలు.. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు మానసరెడ్డిని మోసం చేశారంటూ వరంగల్ సుబేదారి పీఎస్ లో కేసు నమోదైంది. తన కోడల్ని మోసం చేశారంటూ ధర్మారెడ్డి వియ్యంకుడు బాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీమాబాద్ కు చెందిన నర్సింహారాజు, రాజు అనే ఇద్దరు కోయ దొరలు పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించారు. దీంతో విడతల వారీగా అక్షరాల 57లక్షల రూపాయలు ఇచ్చింది మానసారెడ్డి. ఇదే విషయాన్ని కంప్లయింట్ లో వివరించారు బాల్ రెడ్డి. ఇద్దరు కోయదొరలు నర్సింహరాజు, వంశీపై చీటింగ్ కేసు పెట్టారు పోలీసులు.

దేశవ్యాప్తంగా ఉన్న గుళ్లు, గోపురాలు, శక్తిపీఠాల్లో పూజలు, హోమాలు, అన్నదానం చేస్తే కష్టాలు తీరతాయని మానసారెడ్డిని నమ్మించారు కోయదొరలు. ఏడాది కాలంగా రెండు, మూడు, నాలుగు లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.57లక్షలు ఇచ్చారామె. ఇంట్లో కష్టాలు తీరాలని చెబుతున్నా.. ఆరోగ్యం బాగుంటుందని.. రోగాలు నయం అవుతాయనే ఉద్దేశంతోనే ఈ పూజలు చేసినట్లు సమాచారం. వరంగల్ లోని తన బంధువుల ద్వారా ఈ కోయదొరలు పరిచయం అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parkal mla  dharma reddy  manasa reddy  koya dhoralu  con man  crime  

Other Articles