mollywood actor trends on google search నెట్టింట్లో రియల్ విలన్ గురించి భారీ ఎంక్వైరీ..!

Malayalam real villian trends on google search

Pulsar Suni, Attack on actress, Actress attack, Dileep, Actress abduction, Actress assault, Google trends, mollywood, malayalam hero, dileep real villain, movies news

Malayalam movie actor Dileep featured among the top trending topics in Google over the past two days, just like in November when he married kavya madhavan.

నెట్టింట్లో రియల్ విలన్ గురించి భారీ ఎంక్వైరీ..!

Posted: 07/13/2017 04:56 PM IST
Malayalam real villian trends on google search

సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్ సహా నెట్టింట్లో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. ఆయన గురించి తెలుసుకునేందుకు నెట్ జనులు అమితమైన అసక్తిని కనబరుస్తున్నారు. ఆయన గురించిన కథనాలు, అసలేం జరిగింది అన్న విషయాలను తెలుసుకునేందుకు నెట్ జనులు పోటీపడుతుండటంతో ఆయన ఒక్కసారిగా నెట్ లో ట్రెడింగ్ గా మారారు. గత మూడు రోజులుగా ఆయన అటు గూగుల్ తో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెడింగ్ గా మారారు. అయన ఎవరో అర్థమైందా..? మరెవరో కాదు.. మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన హీరో దిలిప్.

తన మొదటి భార్యతో వివాహం తెగదెంపుకులకు కారణమైన నటి విషయంలో తాను భారీ స్ర్కీప్టును రచించి.. నటి కిడ్నాప్ సహా అమెపై అఘాయిత్యం రచించేందుకు కారణమయ్యాడని తెలుసుకున్న నెట్ జనులు వాటి వివరాల్లోకి వెళ్లి.. ఈ అంశానికి సంబంధించిన కథనాల కోసం తెగ గాలిస్తున్నారు. దీంతో గత మూడు రోజులుగా దిలిప్ అటు గూగుల్ సహా ఇటు సామాజిక మాద్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న దిలీప్ వ్యక్తిగత విషయాలను, ఇతర వివాదాస్పద అంశాలను తెలుసుకునేందుకు నెట్ జనులు తెగ అన్వేషణ సాగిస్తున్నారు.

తన మొదిటి భార్యతో తెగదెంపులు చేసుకున్న తరువాత అనూహ్యంగా తన సహచర నటి కావ్య మాధవన్‌ పెళ్లి చేసుకున్న నవంబరులోనూ అయన ఇదే స్థాయిలో ట్రెడింగ్ అయ్యారు. ఇప్పుడు కూడా అయన అదే విధంగా హాట్ టాపిక్ గా మారారు. ఇదేదో ఒక్క భారత్‌లోనే అనుకుంటే అదీ కాదు.. అటు అమెరికాలో, గల్ఫ్‌ దేశాల్లో కూడా దిలీప్ గురించి శోధించడం మొదలుపెట్టారు. అటు, ట్విట్టర్‌, ఫేస్ బుక్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో కూడా ఇప్పుడు ఈ విషయం తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇక తాజాగా దక్షిణాధి రాష్ట్రాల నటుడు కళాభవన్ మణి మృతి కేసులోనూ ఆయన హస్తముందన్న విషయం తెలియడంతో మరింత ట్రెండింగ్ అవుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles