Hoax News on Mangalsutras Viral in Karnataka

Married women to destroy red coral stones in mangalsutras

Karnataka, Karnataka Rumours, Married Woman Destroy Mangalsutra, Women Destroy Mangalsutras, Mangalsutra Red Stone, Karnataka Mangalsutra Rumours, Mangalsutra Red Coral Stone, Thali Husband Life

Rumours began spreading at striking speed in six districts of Karnataka and a few border districts of Andhra Pradesh that the red coral stone in the mangalsutra (thali) worn by women would bring bad luck to their husbands. Following this, thousands of women resorted to smashing the red stones in an effort to ward away the so-called-doom.

తాళిబొట్లను పగలకొట్టేస్తున్నారుగా...

Posted: 07/06/2017 09:50 AM IST
Married women to destroy red coral stones in mangalsutras

భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన సావిత్రి లాంటి పతివ్రతల కథలు పురాణాలకే పరిమితం అనుకుంటుంటాం కానీ, మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అంత కంటే తోపు అబలలు ఇప్పుడు చాలా మందే దర్శనమిస్తున్నారు. కానీ, పతి ప్రాణాల కోసం పవిత్రంగా భావించి కళ్లకద్దుకునే విలువైన తాళిని ముందు వెనకా ఆలోచించకుండా బద్ధలు కొట్టేస్తున్నారు. ఆరు జిల్లాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో మహిళలు ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఎందుకంటారా?

రెండు రోజుల క్రితం కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల్లో ఓ వార్త చక్కర్లు కొట్టడం ప్రారభించింది. మహిళలు తాళి బొట్టులో ఎర్ర పగడం ధరించకూడదని, అలా ధరించడం వల్ల నిద్ర పట్టదని, దానివల్ల భర్తకు ప్రాణ గండమని చెప్పుకున్నారు. అంతే ఎక్కడ పుట్టిందో తెలీదుగానీ దాని మూలంగా మహిళలంతా తమ తాళిబొట్లను తీసి, వాటిల్లోని ఎర్ర పగడాలను ఫటా ఫటా పగులగొడుతున్నారు. గాలి కంటే వేగంగా వ్యాపించిన ఈ పుకారు కేవలం కర్ణాటకకు మాత్రమే కాకుండా, దాని సరిహద్దు ప్రాంతాలకు కూడా పాకింది.

కన్నడలోని ప్రముఖ వార్తా ఛానెళ్లన్నీ దీనిపై కథనాలు ప్రసారం చేశాయి. కొప్పాల్, చిత్రదుర్గ, బల్లారి, దేవనగరి, రాయ్ చూర్ తోపాటు సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతాల్లో కూడా గృహిణులు తమ తాళి బొట్లను పగలకొట్టేశారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంక్షేమ శాఖ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. భర్త ప్రాణాలకు, తాళికి ఎలాంటి సంబంధం ఉండదని, దయచేసి పుకార్లను నమ్మవద్దని విజ్నప్తి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Mangalsutra  Red Coral Stone  Rumours  

Other Articles