Lady singham of UP Police అధికార పార్టీ నేతలకు ఝలకిచ్చిన ‘‘లేడీ సింగం’’

Lady officer in up stood up to an angry mob like a one woman army

Shrestha Thakur, lady Circle Officer, BJP leader, Pramod Lodhi, Bulandshahr, lady singham, vehicle check, challans, Singham, yogi, modi, bollywood, cctv, dabbang mahila, hollywood, viral videos

Uttar Pradesh’s lady Circle Officer (C.I.) Shrestha Thakur. She not only stood up to an angry mob in Bulandshahr protesting the arrest of an MLA’s husband, but she even gave it right back to all of them.

ITEMVIDEOS: అధికార పార్టీ నేతలకు ఝలకిచ్చిన ‘‘లేడీ సింగం’’

Posted: 06/28/2017 09:25 PM IST
Lady officer in up stood up to an angry mob like a one woman army

చట్టం నాకు చుట్టం అనే అధికార పక్షానికి గట్టిగా ఎదురొడ్డి బదులిచ్చిన ఓ లేడీ అఫీసర్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. అధికార పక్షానికి చెందిన ఓ కార్యకర్త కోసం ఏకంగా ఎమ్మెల్యే భర్త వచ్చి.. ఫిర్యాదు చేసినా.. అమె ఏమాత్రం బెదరకుండా సమాధానం చెప్పడంతో అమెను నెట్ జనులు లేడీ సింగం అని లేడీ దబాంగ్ అని ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు ముద్దుగా పెడుతూ అమెపై ప్రశంసలను కురిసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఘటన తాలుకు వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో బులంద్‌షహర్‌ పోలీస్‌ సర్కిల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న శ్రేష్ఠా ఠాకూర్‌ అటువైపు మోటారుబైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి లైసెన్స్‌ అడిగింది. అతని దగ్గర లేదు. ‘నేను అధికారపార్టీ జిల్లాస్థాయి కార్యకర్త’ని అన్నాడు. అయినా అతనికి చలాన్‌ ఇచ్చి రూ.2 వేలు ఇవ్వాలని చెప్పిందామె. అధికారపార్టీ వ్యక్తిననే గర్వాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. శ్రేష్ఠా, ఆమెతో ఉన్న కానిస్టేబుల్‌పై పెద్ద ఎత్తున అరవడం మొదలుపెట్టాడు. అతను మాటలు ఆపకముందే అరెస్టుచేసి.. వూచలు లెక్కపెట్టించింది.

న్యాయస్థానంలోనూ హాజరుపరిచింది! అక్కడా ఆమెపై నోరెత్తితే మరో కొత్త సెక్షన్‌ వేసి జైల్లో పెట్టిందామె. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల్లోని అధికారపార్టీ దండు మొత్తం ఆమె స్టేషన్‌ముందు ధర్నా చేసింది. ఓ పాతికమందిదాకా ఆమెని చుట్టుముట్టారు. ఆమె ఏమాత్రం తొణకలేదు.. బెణకలేదు. హుందాగా, ధీమాగా నడుంపై చెయ్యేసి నిల్చుని.. అంతమందికీ తానొక్కతే ధాటిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ‘మేం రాత్రి ఇంట్లో పిల్లాపాపల్ని వదిలేసి ఇక్కడికొచ్చేది ఆట్లాడటానికి కాదు. మా విధులు మేం చేయడానికి. సరైన పత్రాల్లేకుండా స్కూటర్‌ నడిపేవాళ్లపై చర్యలు తీసుకోవడం మా విధి. అదే చేశాను. అంతగా అయితే ‘పోలీసులు వాళ్ల విధులు చేయాల్సిన అవసరం లేదు!’ అని ముఖ్యమంత్రి నుంచి లేఖ తీసుకురండి. అప్పుడు నేను పనిచేయడం మానేస్తా..’ అనడంతో అధికార పక్షానికి చెందిన నేతలు ఖంగుతిన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles