Gorilla thoroughly enjoys swimming pool at Dallas Zoo డల్లాస్ జూలో భల్లూకము బ్రేక్ డాన్స్..

Gorilla thoroughly enjoys swimming pool at dallas zoo

Zola, gorilla dancing in kidie swimming pool, gorilla dancing in Dallas Zoo, Dallas Zoo, Dallas, Texas, Animal, gorilla, pool, breakdancing gorilla, Zola, Dallas Zoo, entertainment, louisiana hunting, animal, summer heat, dallas

A gorilla video goes viral at the Dallas Zoo, which made it clear that it was really digging a swimming pool and the spectacle was caught on camera.

ITEMVIDEOS: డల్లాస్ జూలో భల్లూకము బ్రేక్ డాన్స్..

Posted: 06/24/2017 02:48 PM IST
Gorilla thoroughly enjoys swimming pool at dallas zoo

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ మాదిరిగా డాన్స్ చేయగలరా.. అంటే ఓ మేం రెడీ అంటూ ఎందరెందరో నేటి యువత ముందుకు రావడం మనకు తెలిసిందే. అయితే స్ప్రింగులా శరీరాన్ని వంపులు తిప్పుతూ.. అసలు ఈయనలో ఎముకలున్నాయా? అన్నంతగా డ్యాన్సులు చేయగల మైఖిల్ జాక్సన్ లా మన హీరోలెందరో కూడా డాన్స్ వేసి ఔరా అనిపిస్తున్నారు. వాటిని యువత కూడా అనుకరిస్తూ టీవీ షోలలో తమ అద్బుత ప్రదర్శనలను ఇస్తున్నారు.

అయితే మనుషుల మాదిరిగానే డాన్సులు వేసి తమలోని అనందాన్ని సంతోషాన్ని మూగజీవాలు కూడా వ్యక్తం చేస్తాయా..? అన్న ప్రశ్నకు ఇప్పటికే అనేక సందర్భాలలో పలు వన్య ప్రాణాలు సమాధానాలను ఇచ్చాయి. తాజాగా మైఖిల్ జాక్సన్ మాదిరిగా అంతే వేగంగా డ్యాన్స్ చేస్తూ గుండ్రంగా తిరుగుతున్న గొరిల్లా వీడియో సంచలనంగా మారింది. ఈ విడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.

ఈ అద్బుత ప్రదర్శనకు డల్లాస్‌ కి మూడు మైళ్ల దూరంలో వున్న జూపార్కు వేదికగా మారింది. ఈ జూ పార్కులో జోలా అనే పేరుగల 14 ఏళ్ల గొరిల్లా వుంది. జూ పార్కుతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లో వేసవి వేడమి తట్టుకోలేని స్థాయిలో వుండటంతో..  జోలా ఉన్న గదిలో జూ నిర్వాహకులు ఒక పెద్ద నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. తొట్టెలోని నీటిలో దిగిన గొరిల్లా పట్టరాని సంతోషంతో గంతులేసింది. వేగంగా నీట్లో కలియదిరుగుతూ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను యూట్యూబ్‌ లో అప్ లోడ్ చేయగా, ఇప్పటి వరకు దానిని సుమారు 8 లక్షల 68 వేల మందికి పైగా వీక్షించారు. మరెందుకు అలస్యం.. మీరూ ఆ వీడియో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zola  Dallas Zoo  entertainment  louisiana hunting  animal  summer heat  dallas  

Other Articles