Woman intentionally set house fire in Milwaukee one killed

Woman filmed setting fire to home with residents inside

Milwaukee, Milwaukee Mishap, Milwaukee Woman Fire, Woman intentionally Set Fire, Woman Set Fire Video, Woman Killed Milwaukee, Milwaukee Video, Milwaukee Viral Video, Wisconsin Facebook Live, Facebook Live Fire Accident

Pour Gas woman sets deadly house blaze in Milwaukee. Willie Greer, 72, was killed in the fire. But a woman was inside the property, and she could be seen clambering out of a window and running to safety.

ITEMVIDEOS: ఫేస్ బుక్ లో భయంకరమైన వీడియో

Posted: 06/20/2017 10:26 AM IST
Woman filmed setting fire to home with residents inside

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భయానక వీడియో దర్శనమిస్తోంది. అమెరికాలో ఓ మహిళ ఇంటికి నిప్పు పెట్టి ఓ వృద్ధురాలిని చంపిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. విస్కన్ సిన్ రాష్ట్రంలోని మిల్ వౌకీ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ మహిళ గ్యాస్ డబ్బాతో ఓ గది దగ్గరికి వెళ్లటం, దానిని కుమ్మరించి ఆపై నిప్పు వెలిగించి అక్కడి నుంచి వెళ్లి పోవటం అందులో ఉంది. మరో పక్క ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో చుట్టుపక్కల వారి హాహాకారాలు, ఓ యువతి పక్కనే ఉన్న కిటికీల్లోంచి దూకటం అందులో దర్శనమిచ్చాయి. ఈ వీడియోను దూరంగా ఓ కెమెరాను అమర్చి స్వయంగా ఆ మహిళే షూట్ చేసి ఫేస్ బుక్ లో లైవ్ ప్రసారం చేసింది.

 

కొందరు యువకులు తెగించి ఆ ఇంటి డోర్లు బద్ధలు కొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించగా, 72 ఏళ్ల ఓ వృద్ధుడు మాత్రం ప్రాణాలు వదిలాడు. ఘటనకు ముందు ఆ మహిళ తమను లైటర్ అడిగిందని, కానీ, తమ దగ్గర లేదని చెప్పటంతో వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షి అయిన రిచ్ మంద్ అనే యువకుడు తెలిపాడు.

మంట పెట్టిన యువతి బాయ్ ఫ్రెండ్ ఆ ఇంట్లోనే ఉంటాడని పోలీస్ విచారణ లో తేలింది. బహుశా.. అతనితో గొడవల కారణంగానే ఆ మహిళ ఇంతటి ఘోరానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న  39 ఏళ్ల అర్సన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Milwaukee  Wisconsin  Woman Set Fire  Facebook Live  

Other Articles

Today on Telugu Wishesh