none claimed $447.8 Million Powerball Jackpot రూ.వేల కోట్ల అదృష్టవంతులూ ముందుకురారూ..!

No one has claimed the 447 8 million powerball jackpot yet

powerball, powerball jackpot, powerball numbers, powerball draw, powerball winners, powerball lottery winner, powerball winner california, riverside california

Lottery officials say they still don't know who bought the winning $447.8 million Powerball jackpot ticket from a Southern California liquor store and encouraged the holder to seek sound financial and legal advice.

రూ.వేల కోట్ల అదృష్టవంతులూ ముందుకురారూ..!

Posted: 06/13/2017 12:09 PM IST
No one has claimed the 447 8 million powerball jackpot yet

అదృష్టముండాలే కాని దానిపై పెద్దని బండరాళ్లు వున్నా సమయం అనుకూలించినప్పుడు ఖచ్చితంగా రాళ్లను బద్దలుకోట్టుకుని వచ్చి తగులుతుందని పెద్దలు వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి అదృష్టమే అమెరికన్ వాసి సొంతమైంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ వ్యక్తిని ఏకంగా రూ.2,888 కోట్లు రూపాయలు (448 మిలియన్‌ డాలర్లు) అకస్మాత్తుగా వచ్చి తగడంతో ఆయన ఏకంగా రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యాడు. ఆయన కొన్న లాటరీ టిక్కెట్ ఆయనకు ఈ అదృష్టాన్ని వరింపజేసేలా చేసింది.

అగ్రరాజ్యంలోని పవర్‌బాల్‌ కంపెనీ నిర్వహించిన ఈ లాటరీలో ఓ స్థానికకుడికి ఈ అదృష్టం వరించింది. అయితే ఆయన వివరాలను చెప్పేందుకు లాటరీ నిర్వాహకులు నిరాకరించారు. లాటరీ గెలిచిన వ్యక్తి ముందుకు వచ్చిన తరువాత ఆయన విజ్ఞప్తి మేరకు మాత్రమే తాము అతని వివరాలను తెలుపుతామని.. అప్పటి వరకు ఆయన వివరాలను గోజ్యంగా ఉంచదలిచామని లాటరీ నిర్వాహకులు తెలిపారు. అయితే లాటరీ మొత్తంలోంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేయనున్నారు.

అయితే ఇంతగొప్పగా బిలీనీయర్ అదృష్టం ఎవరిని వరించిందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అందుకు కారణం.. ఈ లాటరీ టిక్కెట్ కొన్నవారు ఇప్పటి వరకు తామే ఈ లాటరీని కొన్నమాని ముందుకురాకపోవడమే. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని మద్యం దుకాణంలో ఈ బంపర్‌ టికెట్‌ అమ్ముడైనట్లు లాటరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాటరీ టికెట్‌ అమ్మిన దుకాణం యజమానికి కూడా దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలను పవర్‌బాల్‌ అందజేయనుంది. ఇక ఎవరూ ముందుకురాని పక్షంలో తామెలా ముందుకువెళ్లాలన్న విషయమై న్యాయసలహాను తీసుకోదలిచామని నిర్వాహకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : powerball  jackpot  lottery  california  winner  america  

Other Articles

Today on Telugu Wishesh