Women thrash eve-teaser with slippers in gurugram ఈవ్ టీజర్ పై చెప్పులతో మహిళల దాడి

Women thrash eve teaser with slippers in gurugram

women thrash eve teaser, eve teaser slipper women, eve teaser police women, eve teaser, women, thrashed, slippers, police, Viral Videos, Latest news, Viral Videos, cctv viral videos, Gurugram, Haryana, crime

Atleast four to five women thrashed a man with slippers for allegedly eve-teasing one of the woman in Haryana's Gurugram

ITEMVIDEOS: ఈవ్ టీజర్ పై చెప్పులతో మహిళల దాడి

Posted: 06/11/2017 11:04 AM IST
Women thrash eve teaser with slippers in gurugram

అర్థరాత్రి మహిళలు ఒంటరిగా రోడ్డుపై తిరిగగిలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని జాతీపిత మహత్మా గాంధీ చెప్పిన మాటలు గుర్తుకువస్తే.. నిజంగా మహిళలకు ఎదుర్కోంటున్న.. ఎదుర్కోబోతున్న పరిస్థితులను ఆయన అనాడే పసిగట్టారా..? అన్న అనుమానాలు కలుగక మానవు. రొడ్డపైన, వీదుల్లోన ఎక్కడైన సరే మహిళలు తారసపడితే ఆకతాయిలు వెంటపడి వేధించి.. సూటిపోటి మాటలతో వారి హృదయాలను గాయపర్చి.. పైశాచిక అనందాన్ని పోందుతారు.

అందులో రాత్రి సమయం అయితే వాళ్ల ఆగడాలు మరింత పెచ్చు మీరుతాయి. ఇలాంటి ఘటనే హరియాణలోని గురుగ్రామ్‌లో రోడ్డుపై వెళ్తున్న ఓ యువతికి ఎదురైంది. అయితే అడదానికి అడదే శత్రువు అన్న మాటను తోసిరాజుతూ.. యువతికి ఎదరవుతున్న పరిస్థితిని హుటాహుటిన చేరుకున్న నలుగురైదుగురు మహిళలు అకతాయితి బుద్ది చెప్పారు. గురుగ్రామ్ లో యువతిని ఓ ఈవ్ టీజర్ ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ఆ యువకుడు ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. యువతి ఏ మాత్రం బెదిరిపోకుండా ఈ ఈవ్ టీజర్ చేయి పట్టుకుని అడ్డుకుని ప్రశ్నించింది. అకతాయి అమెను బెదిరించే ప్రయత్నం చేశాడు.

ఇంతలో మరో నలుగురు మహిళలు అక్కడకు వచ్చారు. పరిస్థితి గమనించిన వారిలో ఓ మహిళ.. తన చెప్పు తీసి ఆకతాయికి తగిన రీతిలో బుద్ధి చెప్పి శభాష్ అనిపించుకున్నారు. తన కాలి చెప్పు తీసి ఈవ్ టీజర్‌కు దేహశుద్ధి చేశారు. అతడు ఎదురు తిరిగే యత్నం చేయగా మహిళలు ఏ మాత్రం భయపడిపోలేదు. ఆదిశక్తుల్లా ముందుకు దూకారు. ఆకతాయికి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పారు. దీంతో వెన్నులో వణుకుపుట్టి పారిపోవాలని చూసిన ఆకతాయిని పట్టుకుని స్థానికుల సహాయంతో  పోలీసులకు అప్పగించారు. ఈ మహిళల చర్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eve teaser  women  thrashed  slippers  police  Viral Videos  Gurugram  Haryana  crime  

Other Articles