Pak can't dare to take Kashmir issue to ICJ says sushma swaraj సుష్మాస్వరాజ్ బోల్డ్ స్టేట్ మెంట్: పాకిస్థాన్ కు దమ్ములేదు..

Pak can t dare to take kashmir issue to icj says sushma swaraj

Sushma Swaraj kashmir issue, Pakistan india border issue, jammu kashmir cease fire issue, pakistan border terrorism sushma swaraj, Jammu and kashmir india and pak, International Court of Justice, india pakistan border issue icj sushma swaraj, donald trump, barrack obama

External Affairs Minister Sushma Swaraj on Monday said Pakistan cannot take the Kashmir issue to the International Court of Justice (ICJ) and asserted that the issue can only be resolved bilaterally.

సుష్మాస్వరాజ్ బోల్డ్ స్టేట్ మెంట్: పాకిస్థాన్ కు దమ్ములేదు..

Posted: 06/06/2017 02:02 PM IST
Pak can t dare to take kashmir issue to icj says sushma swaraj

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లే దమ్ము పాకిస్థాన్‌కు లేదని విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ బొల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే భారత్, పాకిస్తాన్ లు పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అమె మరోమారు తేల్చిచెప్పారు. కాశ్మీర్ సహా సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం.. సరిహద్దు తీవ్రవాదం అంశాలను కూడా దైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని తాము భావిస్తున్నట్లు సుష్మాస్వరాజ్ తెలిపారు. దాయాది దేశానికి, తమకు మధ్య మూడు వ్యక్తి కానీ, దేశం కాని జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామని అన్నారు.

అయితే  ఉగ్రవాదం, చర్చలు రెండూ కుదరని పని అని కుండబద్దలు గొట్టారు. చర్చలు ముందుకు సాగాలంటే అది పాక్ చేతిలోనే వుందని.. అ దేశం ఎప్పడు ఉగ్రవాదానికి స్వస్తి పలుకుతుందో అప్పుడే చర్యలకు తాము ముందుకు సాగుతామని సుష్మా తేల్చిచెప్పారు. ఇక అమెరికాతో బరాక్ ఒబామా ఉన్నప్పుడు కొనసాగిన సంబంధాలే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత కూడా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ట్రంప్ మోదీకి ఫోన్ చేసి మాట్లాడారని కూడా అమె చెప్పారు.

తాము ఏ ప్రయోజనాలను అశించి పారిస్ ఒప్పందాలను అమోదం తెలపలేదని సుష్మా స్వరాజ్ అన్నారు. ఈ విషయమై డోనాల్ట్ ట్రంప్ చేస్తున్న అరోపణలను అమె తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో పారిస్ ఒప్పందాల నుంచి వైదోలగాలన్న ట్రంప్ నిర్ణయంతో భారత్ అమెరికా దేశాల మధ్య వున్న సంబంధాలపై ఏ మాత్రం ప్రభావం పడబోదని చెప్పారు. గత మూడేళ్లుగా వివిధ దేశాలలో వున్న 80 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించగలిగామని సుష్మాస్వరాజ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles