two thieves tied up upside down and beaten in bihar మళ్లీ రాజ్యమేలిన అటవిక న్యాయం..

Two youths hung upside down thrashed in bihar village

two youths hung upside down in bihar, accused of stealing two youth beaten in bihar, youth hung upside down in bihar, Raj Kumar Bind, Birbal Bind, Mahangu Bind, Sonbarsa village, Nuaon police station, Kaimur district, Bihar, crime

The two youths,were tied with ropes ,hung upside down and given a sound thrashing by a group of muscle-wielding men, on a mere suspicion that they had stolen five plastic chairs hired for a wedding ceremony at the village.

ITEMVIDEOS: మళ్లీ రాజ్యమేలిన అటవిక న్యాయం.. దొంగలన్న అనుమానంతో ఇలా..

Posted: 06/06/2017 12:24 PM IST
Two youths hung upside down thrashed in bihar village

అటవిక న్యాయం రాజ్యమేలే రాష్ట్రం ఏదైనా వుందా అంటే.. వినిపించే పేర్లు ఉత్తర్ ప్రదేశ్, బీహార్.. యోగీ అధిత్యనాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఉత్తర్ ప్రదేశ్ లో పరిస్థితుల్లో మార్పులు ఒక్కసారిగా వచ్చేశాయి. యావత్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ఆయన శాంతిభద్రతలను కల్పించేందుకు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. అయితే అదే స్థాయిలో పనిచేస్తూ.. నిత్యం సామాన్యుల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న నితీష్ కుమార్ బీహార్ లో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. ఏదో ఒక నేరంతో అక్కడ రాజ్యమేలుతున్న అటవిక న్యాయం దేశప్రజల దృష్టిని అకర్షిస్తుంది.

తాజాగా దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు గ్రామయువకులను ఆ గ్రామపెద్ద తన ఇంటి అవరణలో చెట్టుకు కట్టేసి.. వారు సోమ్మసిల్లిపోయేలా దారుణంగా కొట్టడం,, వారి కుటుంబసభ్యులు మూడు వేల రూపాయలను పరిహారంగా ఇచ్చిన తరువాత గానీ యువకులను గ్రామపెద్దలు వదిలిపెట్టేందుకు ఇష్టపడని ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు 200 కిలోమీటలర్ల పశ్చిమాన వున్న ఖైమూర్ జిల్లాలో సోన్ బర్సా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే గ్రామ పెద్ద మహాన్ గు బింద్ ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లి ముగిసిన తరువాత భారాత్ నిర్వహించడంతో పెళ్లింటి వారందరూ భారాత్ తో పాటు గ్రామశివార్ల వరకు వెళ్లారు. వారు తిరిగి రావడంతో ఐదు కుర్చీలను కనపించలేదు. దీంతో గ్రామంలోని రాజ్ కుమార్ బింద్, బీర్బల్ బింద్ లు ఈ దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంలో వారిని తన ఇంటికి పిలిపించుకున్న గ్రామపెద్ద నిలదీస్తుండగానే అతడి బంధువులు శ్రీభగవాన్ బింద్, సహంగు బింద్, దీపక్ బింద్ లు వారిని కాళ్లను కట్టేసి చెట్టుకు వేలాడదీసి వారిని ఇష్టానుసారం కొట్టారు.

నాలుగు గంటల పాటు వీరిని అలానే చెట్టుకు వేలాడదీయడంతో వారి కుటుంబసభ్యులు సమాచారం అందుకుని వచ్చి.. నష్టపరిహారంగా కుర్చీలకు డబ్బులను తాము ఇస్తామని అంగీకరించారు. అయినా వారిని వదిలిపెట్టడానికి విముఖత వ్యక్తం చేసిన గ్రామపెద్ద కుటంభసభ్యులు ముందుగా డబ్బులు చేతిలో పెడితేనా తాము వదిలిపెడతామని చెప్పడంతో వారు ఇరుగుపోరుగువారి నుంచి అప్పు తీసుకువచ్చి గ్రామపెద్దకు ఇచ్చిన తరువాత గానీ వదిపెట్టలేదు. ఈ దారుణ ఘటనను కొందరు తమ సెల్ పోన్ లలో బంధించి.. సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

దీంతో రగంలోకి దిగిన పోలీసులు అటవిక న్యాయం జరిపిన గ్రామ పెద్ద మహాంగు బింద్ తో పాటు నిందితులందరిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శ్రీభగవాన్ బింద్ ను అరెస్టు చేశామని, మిగతా నిందితులందరూ పరారీలో వున్నారని, అయినా వారిని పట్టుకుని అరెస్టు చేస్తామని స్థానిక పోలీసు అధికారి బీరేద్ర పాశ్వాన్. ఇక బాధితులు గ్రామ పెద్దలపై పిర్యాదు చేయడానికి కూడా జంకుతున్నారని, అయితే వారిని తాను సోలిస్ స్టేషన్ కు తరలించిన తరువాత గానీ వారు దైర్యం తెచ్చుకుని తమపై దాడి చేసిన వారి పేర్లను తెలిపారని పాశ్వన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles