Another twist in yadadri lovers honour killing case యాదాద్రి ప్రేమజంట కేసులో వారీకీ ప్రమేయముందా..?

Another twist in yadadri lovers honour killing case

yadadri lovers honour killing case, yadadri lovers swathi naresh, bhongir police interference in honour killing, Amboji Naresh Missing Mystery, bhongir police, naresh, swathi, yadadri love couple, honour killing, human rights commission, crime

Another twist in yadadri lovers honour killing case, naresh family members and relatives allege police interference in murder, approach human rights commission,

యాదాద్రి ప్రేమజంట కేసులో వారీకీ ప్రమేయముందా..?

Posted: 05/28/2017 10:58 AM IST
Another twist in yadadri lovers honour killing case

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన యాదాద్రి ప్రేమ జంట కేసులో, ప్రియుడు అంబోజు నరేశ్‌, స్వాతి చావుకు భువనగిరి పోలీసుల పాత్ర కూడా వుందా..? అంటే అవుననే అంటున్నారు నరేశ్ తరపు బంధువులు ఆరోపించారు. తాము మొదట్నించి అనుమానిస్తున్నట్లుగానే పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే నరేశ్ హత్యచేయబడ్డాడని అరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని అన్నారు. నరేశ్ అదృశ్యంపై ఫిర్యాదుపై చాలా రోజుల వరకు పోలీసులు స్పందించలేదని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి డీసీపీ యాదగిరి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు.

మేజర్ల పెళ్లి వియషంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. పెళ్లైన వారానికే ఎందుకు స్వాతి-నరేశ్ ను ముంబై నుంచి ఎందుకు రప్పించారని నిలదీశారు. మళ్లీ రెండోసారి వీరిని ఆత్మకూరు రప్పించడంలో పోలీసుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మకూరు, రామన్నపేట, భువనగిరి పోలీసుల తీరుపై నరేశ్ బంధువులు మండిపడ్డారు. భువనగిరి పోలీసులపై చర్యల్లేవా, ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసుల వ్యవహారశైలిపై వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhongir police  naresh  swathi  yadadri love couple  honour killing  human rights commission  crime  

Other Articles