Actor Kavita Miffed At TDP Leaders’ Attitude మహానాడు సాక్షిగా తెలుగు మహిళా నేత కంటతడి

Actor kavita miffed at tdp leaders attitude walks out

actress kavita dissatisfaction, actress kavita dissatisfaction at mahanadu, setback for kavita at mahanadu, ill treatement towards kavita at mahanadu, actress, kavita, mahanadu, ill treatment, dissatisfaction, TDP leaders, attitude, vizag

Film actor-turned-politician Kavitha has walked out of Mahanadu in a huff when the organisers did not invite her to sit on the dais.

మహానాడు సాక్షిగా తెలుగు మహిళా నేతకు అవమానం..?

Posted: 05/27/2017 05:47 PM IST
Actor kavita miffed at tdp leaders attitude walks out

ప్రియమైన సోదరీ సోదరీమణులారా.. ఇది తెలుగు దేశం పార్టీ స్థాపించేందుకు ముందు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన మాట. దీనితోనే నేతలు అప్పట్లో తమ రాజకీయ ప్రసంగాలను మొదలు పెట్టేవారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత.. ఎన్నికల సమరాంగనంలోకి అన్నగారు స్వర్గీయ ఎన్టీరామారావు దిగిన తరువాత.. ఆ పద్దతిని పక్కనబెట్టేశారు. నా తెలుగింటి ఆడపడచులకు, అక్క చెల్లెలకు అంటూ మహిళలను అక్కున చేర్చుకునేలా ప్రసంగాలను చేసి వారి ఓట్లను తమ అకౌంట్ లో వేయించుకున్నారు.

అయితే అది కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదు. మహానాడులోనూ, పార్టీ సమావేశాలల్లోనూ ఎన్టీయార్ దానిని విరివిగా వాడి తెలుగు దేశా పార్టీ మహిళమణుల ఔనాత్యాన్ని పెంచేలా అనేక చర్యలు తీసుకున్నారు. కాలగమనంలో ఆయన అనంతవిశ్వంలోకి వెళ్లినా.. ఇప్పటికీ ఆయనకు లక్షల సంఖ్యలో మహిళా అభిమానులు వున్నారంటే అది ఆన వారికి ఇచ్చిన మర్యాద., గౌరవం వల్లనే. ఆర్టీసీ బస్సులలో వారికి ప్రత్యేక సీట్లను కేటియించడం నుంచి  తల్లిదండ్రుల ఆస్తులలో వాటా వారకు అన్నింటా మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. అందుచేతే అన్నగారంటే తెలుగు మహిళలకు ఎనలేని అభిమానం.

కాగా, తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రం మహిళలకు ఆ ప్రాధాన్యతను ఇవ్వడం లేదని, కేవలం ఎన్నికల వరకు వారి సేవలను వినియోగించుకుని ఆ తరువాత కూరలో కరివేసాకులా తీసిపారేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వెఎస్ దెబ్బతో దాదాపుగా పదేళ్లు అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ.. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన జరిగి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినా.. అక్కడ కూడా తెలుగు మహిళలకు తగిన ప్రాధాన్యం, ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని పలువురు నేతలు వాపోతున్నారు.

పార్టీ నిర్వహించిన మహానాడులో చేధుఅనుభవం ఎదురైన నటి కవిత కూడా ఇదే అవేదనను వ్యక్తం చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో, మహానాడు ప్రాంగణం నుంచి ఆమె వెళ్లిపోయారు. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తనను వేదికపై కూర్చోబెట్టారని... అధికారంలోకి వచ్చాక తనను పక్కనపెట్టి అవమానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని కవిత ప్రశ్నించారు. మహిళామణుల అధరణను చూరగోన్న పార్టీ అని ఢంకా బజాయించే పార్టీలోనే మహిళా నేతలకు అవమానాలు జరగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  kavita  mahanadu  ill treatment  dissatisfaction  TDP leaders  attitude  vizag  

Other Articles