Woman abducted as Husband fails to return loan హైదరాబాద్ లోనూ కాల్ మనీ అఘాయిత్యాలు..

Money lender arrested for abducting borrower s wife

call money in hyderabad, borrowers wife abducted by money lenders, kidnap, Money-lender, Arrest, call money, Borrower’s Wife, hyderabad, nizambad, Woman abducted as Husband fails to return loan

A private money-lender was arrested for abducting a 35-year-old woman after her husband failed to repay a loan in the city here.

భర్త అప్పు తీర్చలేదని భార్యను కిడ్నాప్ చేసిన దుండగులు

Posted: 05/17/2017 11:40 AM IST
Money lender arrested for abducting borrower s wife

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కాల్ మనీ ఉదంతం యావత్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేకెత్తించింది. ఈ దారుణాలను మర్చిపోదామనుకన్నా ప్రజలకు అక్కడక్కడా ఈ ఘటనలను ఎదురవుతూనే వున్నాయి. రావణకాష్టంలా నిత్యం ఈ పెను సమస్య రాజుకుంటూనే వున్నా.. ప్రభుత్వాలు మాత్రం తూతూ మంత్రిగా చర్యలు తీసుకుని.. వదిలేయడంతో కాల్ మనీ దుండగులు మరింతగా రెచ్చిపోతున్నారు. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా వారి అకృత్యాలను, అఘాయిత్యాలను వెలుగులోనికి రానీయకుండా వారికి అధికార వర్గంతో పాటు అధికార యంత్రాంగం కూడా అండగా నిలుస్తున్నారు.

ఇక దీంతో ఇందగలడు అందులేడని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే గలకు కాల్ మనీ దుండగుడు అన్నట్లుగా తయారైందీ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ లో కాల్ మనీ ముసుగులో మహిళల చేత వ్యభిచారం కూడా చేయించారన్న అరోపణలు అప్పట్లో మిన్నంటాయి. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాల అవసరాలను అసరాగా చేసుకుని అధికవడ్డీ ఆశతో వారి కట్టిన సోమ్మునంతా వడ్డీ కింద జమకట్టి.. అసలు కోసం వారిన ముప్పుతిప్పలు పెట్టిన ఘటనలు అనేకం.

తాజాగా హైదరాబాద్ లోని అంబర్ పేట్ డీడీ కాలనీలో అప్పు చెల్లించలేదని ఓ వడ్డీ వ్యాపారి తన అనుచరులతో వీరంగం సృష్టించాడు. అప్పు చెల్లించనందుకు గాను బాధితుడి భార్యను అపహరించుకుపోయాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతం అయింది. వివరాల్లోకి వెళ్తే.. బీమవరంకు చెందిన శ్రీనివాస్ డీడీ కాలనీలో ఆర్కిడ్ అపార్ట్మెంటులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన మరో వాచ్ మెన్ శ్రీనివాస్ వద్ద అవసరం నిమిత్తం నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే నాలుగేళ్లు గడిచింది. ఈ క్రమంలో అతని అవసరాలు మరింత పెరిగాయి. దీంతో వడ్డీ కూట్టడం కూడా కష్టమైంది.

ఎన్ని పర్యాయాలు డబ్బును చెల్లించమని అడిగినా శ్రీనివాస్ నుంచి స్పందన రాకపోవడంతో.. డబ్బిచ్చిన శ్రీనివాస్ ఏకంగా వాచ్ మెన్ శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆయన భార్య నాగ‌మ‌ణితో గొడ‌వ ప‌డి.. అమెను తన స్నేహితుల సాయంతో కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. డ‌బ్బు క‌ట్టి భార్యను తీసుకెళ్లాల్సిందిగా శ్రీనివాస్ కు చెప్పాడు. ఈ పరిణామాలను చూసి నాగమణి కొడుకు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఏడుస్తూ కూర్చోవడం చూసి అపార్టుమెంటు వాసులు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆదారంగా నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.  కారు నిజామాబాద్‌కు వెళ్లిన‌ట్లు తేల‌డంతో పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితులను కూడా ప‌ట్టుకుని అంబ‌ర్‌పేట్‌కు తీసుకువ‌చ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidnap  Money-lender  Arrest  call money  Borrower’s Wife  hyderabad  nizambad  crime  

Other Articles