DSP Anjan Bora arrested ఈ డీఎస్సీ ‘ఫేస్ బుక్క’య్యింది..

Dsp held for obscene facebook remarks about assam woman mla

assam police, anjan bora, anjan bora facebook post, anjan bora on bjp mla, assam police battalion, assam assembly, assam news, latest news

A DSP, who had hit headlines four days ago for reportedly making some derogatory remarks against a ruling BJP MLA in Assam was arrested.

ఈ డీఎస్సీ ‘ఫేస్ బుక్క’య్యింది..

Posted: 04/30/2017 07:52 AM IST
Dsp held for obscene facebook remarks about assam woman mla

ఉత్తర్ ప్రదేశ్ ఓ పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించి.. బతికి వుండగానే చర్మం ఊడతీయిస్తానంటూ బారబాంకీ బీజేపీ ఎంపి ఘటనను మర్చిపోకముందే..  అసోంకు చెందిన డీఎస్పీ ఒకరు అధికార బీజేపి ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిని ఏకంగా ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో తీవ్ర దుమారం రేపుతోంది. అసోం డీఎస్పీ అంజన్ బోరా ఇటీవల అధికార బీజేపీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేపై ఫేస్ బుక్ లో అసభ్య పోస్టు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది.

డీఎస్సీ అంజన్ బోరా ఏకంగా మహిళా ఎమ్మెల్యేను అమె ఇంటి పేరుతో సంబోదిస్తూ పేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అంతటితో అగకుండా తాను ఓ పోలీసు అధికారి అన్న విషయాన్ని మర్చిపోయిన సదరు పోలీసు అధికారి.. ఇలాంటి పోస్టు ఎవరైనా.. ఎవరిపైనైనా పెటితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ఉద్యోగంలో కొనసాగుతూ.. అత్యంత అసభ్యకరంగా మహిళా ఎమ్మెల్యేపై పోస్టు పెట్టాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఓ మహిళా ఎమ్మెల్యేపై ఆయన పెట్టిన పోస్టుపై దుమారం రేగుతుంది.

దీంతో అంజన్ బోరాపై రాష్ట్ర బీజేపి తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు పిర్యాదు చేసింది. దీంతో ఆయనపై శాఖపరమైన చర్యలు ప్రారంభించింది రాష్ట్ర పోలీసు శాఖ. ఆయనపై డిపార్టమెంట్‌ పరిధిలో విచారణ ప్రారంభించడమే కాకుండా.. నేరపూరిత అభియోగాల కింద ఆయనను సీఐడీ అరెస్టు చేసింది. బోరా అత్యంత చాకచక్యంగా పోస్టు పెట్టి మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. అక్కడున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలలో ఒకరు కాదు అంటూ క్లూ ఇచ్చిన ఆయన మరోకరిపై మాత్రం కేవలం ఇంటిపేరుతోనే సంబోధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  DSP anjan bora  Facebook post  BJP woman MLA  

Other Articles