miraculous escape of driver from terrific accident వీడికి నూకలు బాకివున్నాయంటే అతిశయోక్తి కాదు

Jeep driver ejected in alabama crash miraculously walks away from wreck

washington accident, road accident, jeep rolled over, Alabama, terrific accident, Miraculous escape, viral video

The footage showed a jeep flipping multiple times after smashing into another car. But as the jeep rolled over, the driver was ejected out of the car. Miraculously after being thrown out, he got up on his feet and walked towards the wrecked car.

వీడికి నూకలు బాకివున్నాయంటే అతిశయోక్తి కాదు

Posted: 04/30/2017 07:04 AM IST
Jeep driver ejected in alabama crash miraculously walks away from wreck

అత్యంత ఘోరమైన ప్రమాదం బారిన పడిన వ్యక్తం స్వల్ప గాయాలతో ప్రాణాలతో భయపడిన సందర్బంగా ఎవరైన పెద్దలుంటే వారు అనే మాట ‘‘వీడికి ఇంకా భూమ్మిద నూకలు బాకీ వున్నాయి’’. ఈ ప్రమాదాన్ని చూస్తే వాళ్లే కాదు మీరైనా సరే..  ఔరా వీడు అదృష్టవంతుడు.. అని అనక తప్పదు. ఓవర్ చేస్తూ అతివేగంగా దూసుకెళ్లి పక్కున్న కారుకు ఆ తరువాత డివైడర్ ఢీకొన్న వాహనం తునాతునలైన తరువాత కూడా ఆ వాహనం డ్రైవర్ ప్రాణాలతో బయటపడిన తీరు.. అందరినోట ఇదే మాట అనిపించడం.  ఈ విడియో కూడా వైరల్ గా మారింది.

అతివేగం అనార్థాలకు కారణకం.. ప్రమాదాలకు నెలవని పెద్దలు చెప్పినా.. పాటించని యువకుడు తన వాహనంలో అతివేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురై పల్టీలు కొట్ట్టింది. అయితే ఆ యువకుడు మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంతేకాదు.. ప్రమాదానికి గురైన తన జీపు ఎలా ఉందో చూసేందుకు పరుగులు పెట్టడంతో నెట్ జనులు ఆ వీడియోనే తీక్షణంగా వీక్షిస్తుండటంతో అది కాస్తా ట్రెడింగ్ అవుతుంది. అమెరికాలోని అలబామాలో చోటుచేసుకుందీ ఘటన.

ఏజే కెల్విన్ అనే వ్యక్తి తన కారులో డ్యాష్ క్యామ్‌ను అమర్చుకున్నాడు. అలబామాలో అంతర్రాష్ట్ర రహదారి 65పై కారులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో తెలుపురంగు జీపు అతివేగంగా రహదారిపై దూసుకెళ్తోంది. ముందు వెళ్తున్న కారును జీపు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టాడు. క్షణాల్లో జీపు రోడ్డుపై బోల్తాపడి గాల్లో పల్టీలు కొడుతూ కొద్దిదూరం వెళ్లి ఆగింది. ఈ క్రమంలో జీపు నుంచి డ్రైవర్ రోడ్డుపై పడిపోయాడు. వెంటనే లేచి తన జీపు ఎలా ఉందో చూసుకునేందుకు వేగంగా కదలడం.. ప్రమాదాన్ని చూసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఇది నిజంగా అద్భుతమనే నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles