'Flying car' to go on sale by end of year ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయోచ్..!

Kitty hawk flyer an electric flying vehicle to go on sale this year

drone like flying car, Kitty Hawk Flying car, Larry Page flying car, google co founder larry page, Kitty Hawk Flyer, Larry Page, kitty, soon traffic jams in air, funny, 2017, top, most, enginner, newyork, messi, lionel, nba

Flying cars are no longer reserved for the on-screen worlds, In one of the first public test, a prototype, seen in a video, whizzes over the waters of a lake about 100 miles north of San Francisco.

ITEMVIDEOS: ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయోచ్.. ఇక గాల్లోనే ట్రాఫిక్ జామ్..!

Posted: 04/27/2017 03:15 PM IST
Kitty hawk flyer an electric flying vehicle to go on sale this year

త్వరలో గాలిలో ఎగిరే ఎయిర్ కార్లు మార్కెట్ లోకి రానున్నాయి. వినడానికి విచిత్రంగా వున్నా.. ఇది ముమ్మాటికీ నిజం ఇప్పటివరకు కేవలం హాలీవుడ్, బాలీవుడ్, ఇక పౌరాణిక చిత్రాలలో మాత్రమే దేవతల వాహానాలను గాల్లిలో ఎగురుతూ వెల్లఢాన్ని చూసిన మనకు త్వరలోనే అవి వాస్తవిక రూపంలో కూడా అవిష్కృతమవుతాయని సమాచారం. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఎగిరే కారు మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు సదరు కారు తయారీ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటనతో తెలిపింది.

గాలీలో ఎగిరే కార్ల నిర్మాణాన్ని చేపడుతున్న కిటీ హాక్ సంస్థ అప్పుడే ఈ కారును ప్రయోగాలను కూడా చేపట్టింది. ఇందుకు సంబంధించి కూడా ఓ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది.  అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీగా ప్రారంభ‌మైన కిటీ హాక్ సంస్థ తమ ఎగిరే కారుకు సంబంధించిన తొలి న‌మూనాను విడుద‌ల చేసింది. త్వర‌లోనే మార్కెట్లోకి ఎగిరే కార్లు వ‌స్తాయ‌ని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది కిటీ హాక్ సంస్థ‌. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ సంస్థకు గూగుల్ స‌హ‌వ్యవ‌స్థాప‌కుడైన లారీ పేజ్ యజమానిగా వున్నారు.

ఎనమిది రోటార్ల స‌హాయంతో ప‌నిచేసే ఈ ఫ్లయింగ్ కారు… టేకాఫ్, ల్యాండింగ్‌లు  హెలికాఫ్టర్ తరహాలోనే వుండనున్నాయి. కేవ‌లం 100కిలోల బ‌రువుండే ఈ వెహిక‌ల్ గంటకు 40 కిలోమీట‌ర్ల వేగంతో.. 15 అడుగుల ఎత్తులో ప్రయాణించ‌గ‌ల‌దు. ఈ కారుకు సంబంధించిన అన్ని ప‌రీక్షలు ప్రయోగాత్మకంగా నిర్వహించామ‌ని సంస్థ తెలిపింది‌. దీనిని న‌డిపేందుకు పైలెట్ లైసెన్స్ అవసరం లేదని, ఇక కేవలం బ్యాటరీ సాయంతో ఇది నడుస్తుందని కూడా సంస్థ యాజమాన్యం వివరించింది.

దీనిని నడిపించడానికి కేవలం రెండు గంటల తర్ఫీదు పోందితే చాలని పేర్కోంది. ఈ కారు గురించి పూర్తి వివ‌రాల‌ను త‌మ వెబ్ సైట్ లో ఉంచామని కిటీ హాక్ సంస్థ యాజమాన్యం తెలిపింది. కొన్ని మిలియన్ డాలర్లను ఈ ఎగిరే కారు ప్రయోగంలో లారీ పేజ్ పెట్టుబడులుగా పెట్టారని సంస్థ వెల్లడించింది. ఈ ఎగిరే కారు ధర ఎంత అన్న వషయాన్ని మాత్రం సంస్థ గోప్యంగా వుంచింది. ఈ కారు కొనుగోలు చేసుకోవాలకునేవారు తమ సంస్థలో ఏడాదికి వంద డాలర్ల చోప్పున చెల్లింది సభ్యత్వం తీసుకోవాలని, సభ్యులుగా చేరిన వారకి తమ కారు రెండు వేల డాలర్ల తక్కువ ధరలో అందిస్తామని యాజమాన్యం పేుర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kitty Hawk Flyer  Larry Page  kitty  funny  2017  top  most  enginner  newyork  messi  lionel  nba  

Other Articles