చిన్నమ్మ మేనల్లుడు టూమచ్.. ఏకంగా ఈసీకే లంచం ఇవ్వబోయాడే.... | Dinakaran try to bribe EC for party symbol.

Delhi police files bribery case against dinakaran

AIADMK Deputy Chief, Sasikala Natarajan Niece, Sasikala Niece Troubles, Dinakaran Bribe Case, Dinakaran Election Commission Bribe Case, Dinakaran Two Leaves, Two Leaves EC Bribe Case, AIADMK Dinakaran, Dinakaran Case, TVV DInakaran , Delhi Police Dinakaran

AIADMK deputy chief TTV Dinakaran booked in bribery case for two leaves symbol.

ఈసీకి లంచం.. దినకరన్ పై కేసు

Posted: 04/17/2017 10:00 AM IST
Delhi police files bribery case against dinakaran

శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్ దినకరన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ పై కేసు నమోదు చేశారు కూడా.

ఆర్కే నగర్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రెండాకుల గుర్తు గురించి పన్నీర్ సెల్వం వర్గం, శశికళ గ్రూప్ కి మధ్య వివాదం చెలరేగింది. ఇరువురి వాదనలు విన్న ఈసీ పార్టీ పేరును, గుర్తును ఫ్రీజ్ చేసి ఇద్దరికీ వేర్వేరు గుర్తులను ఇచ్చేయటం తెలిసిందే. ఆ సమయంలో రెండాకుల గుర్తు తమకే కేటాయించాలంటూ ఈసీకి దినకరన్ లంచం ఇవ్వజూపాడంట.ఈసీకి రూ. 60 కోట్లు ఇస్తానని, రెండాకుల గుర్తు తనకు దక్కేలా చేయాలని మధ్యవర్తి సుఖేష్ చంద్రతో డీల్ కుదుర్చుకుని బయానాగా రూ. 1.39 కోట్లు ఇచ్చాడంట.

చంద్రేశేఖర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఇచ్చిన వివరాలు మేరకు దినకరన్ పై ఢిల్లీ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో ఓటర్లకు డబ్బు పంచాడనే ఆరోపణలు రావటంతో ఎన్నికలనే వాయిదా వేసిన సంగతి విదితమే. అయితే సుఖేష్ ఎవరో తెలీదని, ఈ వ్యవహారంతో తనకేం సంబంధం లేదని దినకరన్ మీడియాతో వెల్లడించాడు.

ఇక వరుసగా వ్యవహారాలన్నీ బయటపడుతుండటంతో ఆయన్ని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ పదవీ నుంచి తొలగించాలనే డిమాండ్ ను కొంత మంది మంత్రులు బలంగా వినిపిస్తున్నారు. అయితే 38 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్న దినకరన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పళనీస్వామి ప్రభుత్వం ఉన్నపళంగా పడిపోయే అవకాశమూ లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dinakaran  Election Commission  Bribe Case  

Other Articles