రూ. 10 నాణేలను తీసుకోవాల్సిందే: అర్బీఐ Not accepting Rs 10 coin will land you in jail

People should continue to accept rs 10 coins as legal tender rbi

Rs 10 coins, new Rs 10 coin, Telangana, Andhra Pradesh, demonetisation, RBI, Shaktikanta Das, finance ministry, arun jaitley, pm modi, mobile, business, fincance

The Reserve Bank of India has advised members of the public not to give credence to such rumours and to continue to accept these coins as legal tender in their transactions.

రూ. 10 నాణేలపై దుష్ప్రచారం నమ్మొద్దు.. తీసుకోవాల్సిందే: అర్బీఐ

Posted: 04/11/2017 07:50 PM IST
People should continue to accept rs 10 coins as legal tender rbi

పది రూపాయల నాణేలపై శృతిమించిన స్థాయిలో వస్తున వదంతులు వట్టి మాటలని తేలిపోయింది. రూ. 10 నాణేల విషయంలో అటు చిల్లర వ్యాపారుల నుంచి హోల్ సేల్ వ్యాపారుల వరకు బాడా వాణిజ్యవేత్తల వరకు అందరూ రూ.10  నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నుంచి పలు నోట్లపై ఇలాంటి వదంతులు వస్తున్నాయి. మొదట కర్ణాటకలో ఈ తరహా వదంతులే రేగాయి. అప్పట్లో రంగంలోకి దిగిన అర్బీఐ రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని.. వాటిని తీసుకునేందుకు నిరాకరించిన వారిపై అర్భీఐ చట్టపర్యంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడంతో ఆ వివాదం కాస్తా అక్కడ సద్దుమణిగింది.

అంతే అక్కడ పులి అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తోక కనిపించిందన్నట్లు.. అక్కడ సద్దుమణిగిన లొల్లి కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. దీంతో పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ వదంతులు వ్యాపించాయి. ఇక వ్యాపారులు, వర్తకులు, వాణిజవేత్తల అందరూ వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా గత కొన్ని రోజులుగా పది నాణేలాను చిల్లర వర్తకుల నుంచి ఎంరూ తీసుకోవడం లేదు. అసలు ఈ నాణేలు చెల్లబాటు కావంటూ.. కూడా వదంతులు వ్యాపించాయి. ఇక పలు చోట్ల బ్యాంకులు కూడా వీటిని తీసుకునేందుకు నిరాకరించడంతో.. ఈ వదంతులకు బలం చేకూరింది.

దీంతో ఆర్బీఐ అధికారులు స్పందించక తప్పిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు రంగంలోకి దిగి ఓ ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణలో రూ.10 నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, అవన్నీ అపోహలేనని పేర్కొంది. పాత, కొత్త పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని అన్ని దుకాణాల్లో వీటిని వినియోగించుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే వీటిని తీసుకునేందుకు నిరాకరించిన వ్యాపారులపై చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 10 coins  new Rs 10 coin  Telangana  Andhra Pradesh  demonetisation  RBI  

Other Articles