వాహనదారులకు సచిన్ టెండుల్కర్ హెల్మెట్ క్లాసులు Sachin Tendulkar suggests riders to wear helmet

Sachin tendulkar suggests riders to wear helmet

Sachin Tendulkar, Rajya Sabha, Tendulkar, Cricket legend, mp sachim tendulkar, traffic stop, helmet lessons, sachin news, tendulkar news, Hyderabad

Cricketer-turned-parliamentarian Sachin Tendulkar turned into a road safety activist at a traffic stop in Hyderabad, urging bikers to wear helmets even as they seemed more keen on clicking selfies with him.

ITEMVIDEOS: వాహనదారులకు సచిన్ టెండుల్కర్ హెల్మెట్ క్లాసులు

Posted: 04/10/2017 07:41 AM IST
Sachin tendulkar suggests riders to wear helmet

క్రికెట్ దేవుడిగా భారత క్రికెట్ అభిమానులు కొలిచేవారు ఎవరైనా వున్నారంటే అది కేవలం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయనను అంతాలా అభిమానించే ఫ్యాన్ వుండటానికి కారణం ఆయన క్రికెట్ ఆట.. అయితే దీనికి తోడు సచిన్ లో వున్న ప్రత్యేక లక్షణాలు కూడా ఆయనను అభిమానులకు మరింత దెగ్గర చేశాయి. అవి ఏమిటీ అంటే చెప్పడం కష్టమే. ఒక్కటైతే చెప్పోచ్చు. కానీ అనేకమైతే ఎం చెప్పగలం.

అయితే తాజాగా సచిన్, సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా వాహనదారుల వైఖరిలో పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండంటూ మాజీ క్రికెటర్ సచిన్ తన ఫేస్ బుక్ లో ఆదివారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కేవలం గంటలోనే 20 లక్షల మంది వీక్షించడం విశేషం. అరకోటికి పైగా షేర్లు, లక్షల మంది లైక్స్ తో దుమ్మురేపుతుంది.

రోడ్డు భద్రతా అంటే హెల్మెట్ ధరించడమని తనతో సెల్ఫీ దిగేందుకు రోడ్డుపై ఆగిన ఇద్దరు యువకులకు సచిన్ చెప్పారు. ఈ వీడియో గమనించినట్లయితే.. ఓ యువకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దయచేసి హెల్మెట్ ధరించండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. మరోసారి తనకు బైకుపై కనిపిస్తే హెల్మెట్ తోనే కనిపించాలని యువకుడికి సూచించగా .. ఒకే అంటూ అతడు బదులిచ్చాడు. ఆపై సచిన్ ను గుర్తించి నమస్కారం పెట్టిన మరికొందరికి కూడా సచిన్ ఇదే విషయాన్ని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sachin Tendulkar  Bikers  helmet lessons  traffic stop  Hyderabad  

Other Articles