ఆ నాయకుడి లైవ్ షోలోకి వచ్చిన అతిధి ఏం చేసిందీ.? Cat Interrupted Latvian Mayor Live Stream

The new bbc dad is a latvian mayor whose cat interrupted his live stream

Nils Usakovs, Cat video, Russian Mayor, Cat in interview, Latvia, Riga, car in live streaming, video crasher, bbc dad, viral, trending

Nils Usakovs, the mayor of Latvia's capital of Riga, was in the midst of what looked like a pretty dull live online. The things got interesting, if only for a few seconds, in the form of a video crasher

ITEMVIDEOS: ఆ నాయకుడి లైవ్ షోలోకి వచ్చిన అతిధి ఏం చేసిందీ.?

Posted: 04/09/2017 10:58 AM IST
The new bbc dad is a latvian mayor whose cat interrupted his live stream

టీవీ లైవ్‌ షో అంటూ వినడానికి ఈజీగానే వుంటుంది. కానీ ఎంతకష్టంమో తీసేవాళ్లకే తెలుస్తుంది. ఇది చాలదన్నట్లు ఈ మధ్యకాలంలో లైవ్ షోలలో అనుకోని అతిధుల సంఖ్య కూడా పెరిగిపోతూ.. కొంత ఆసక్తికరంగా మారుతుండగా, కొంత హాస్యాన్ని కూడా పండిస్తున్నాయి. ఆ మధ్య బిబిసి చానెల్ లో ఓ తండ్రి లైవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అతడి చిన్న పిల్లలు దూసుకొని వచ్చి కాసేపు ఆ కార్యక్రమం దృష్టి మరల్చారు. సరిగ్గా అలాంటి సంఘటనే మరోకటి చోటుచేసుకుంది.

లాత్వియా రాజధాని రిగాకు మేయర్ నిల్స్‌ ఉసాకోవ్స్‌ స్థానికంగా వున్న భూ అక్రమాలపై ఆన్‌లైన్‌ ద్వారా లైవ్‌ షో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. సిబ్బంది కూడా అన్ని ఏర్పాటు చేశారు. టేబుల్‌పై ల్యాప్‌టాప్‌ పెట్టుకొని నిల్స్‌ ఉండగా పక్కన ఓ గ్లాస్‌, ఆయన వెనుక ఆయన కార్యాలయానికి చెందిన ఇద్దరు మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. ఎదురుగా లైవ్‌ కెమెరా కూడా వుంది. ఇంకెందుకు అలస్యమని ఆయన లైవ్ లో వుండగా, అనుకోని అతిధి వచ్చారు.

అదెవరోకాదు, మేయర్ తన నివాసంలో పెంచుకుంటున్న మార్జాలము. అర్థంకాలేదా.. అదేనండీ పిల్లి. నల్లని వర్ణంలో ఒక్కసారిగా మేయర్ వద్దకు చేరుకుని ఆయన ఓ వైపుగా టేబుల్ పైనున్న కప్పులో ఏదో దానికోసమే పెట్టారనుకుని వచ్చింది, అందులో వున్న నీటిని తాగి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఆయన ఒక్కసారిగా ఆగిపోయి దానిని నవ్వుతూ చూస్తుండిపోయారు. ఇక తన కార్యాలయ సిబ్బంది దానిని పంపించడంతో ఆయన తిరిగి లైవ్ లోకి వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles