ఇక రోజూ వారీగా మారునున్న ఇంధన ధరలు Petrol and diesel prices change on daily basis

Petrol and diesel buyers be ready for a daily change in prices

petrol prices, diesel prices, oil marketing companies, indian oil, oil india, omcs, bharat petroleum, hindustan petroleum, petrol bunks

State-run oil marketing companies, which control over 90 per cent of the retail fuel market in the country, are mulling a plan that would allow daily changes in the price of petrol and diesel

ఇక రోజూ వారీగా మారునున్న ఇంధన ధరలు

Posted: 04/07/2017 02:14 PM IST
Petrol and diesel buyers be ready for a daily change in prices

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధరలను పరిగణలోకి తీసుకుని ఇక రోజువారిగా పెట్రో ఉత్పత్తుల ధరలను మారనున్నాయి. అంటే ఇక పెట్రోల్ బంక్ వెళ్తే కానీ పెట్రోల్ ధర ఎంతుందో తెలియని అయోమక స్థితికి చేరుకోవాల్సిన అవసరం ఏర్పడనుంది. ప్రస్తుతం ఫోరెక్స్, బులియన్ మార్కెట్ మాదిరిగా పెట్రో ఉత్పత్తి ధరలు కూడా రోజువారిగా మారనున్నాయి. ప్రస్తుతం అంతర్జాతయంగా క్రూడ్ అయిల్ ధరలను పక్షం రోజులకు ఓ పర్యాయం సమీక్షిస్తున్న చమురు సంస్థలు.. ఇకపై ఏరోజుకారోజునే సమీక్షించనున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అమోద ముద్ర వేసే యోచనలో వుంది. కేంద్రమే ఈ తరహా ప్రతిపాదనకు సంసిద్దత వ్యక్తం చేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఇంధన సంస్థలకు సూచించినట్లు సమాచారం. ఇండియాలోని రిటైల్ ఫ్యూయల్ మార్కెట్లో 90 శాతం వాటా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రోజువారీ ధర విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నాయని 'ఎకనామిక్ టైమ్స్'లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.

రోజువారీ ధరలను మార్చే పద్ధతిని డైమనిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ గా పేర్కొంటూ ఈ విధానం వస్తే, ఇంధన ధరలను మరింత పాదర్శకంగా అమలు చేయవచ్చని, ఇండియా సైతం అంతర్జాతీయ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానంలోకి వెళ్లినట్లవుతుందని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయట. కాగా, దీనిపై స్పందించేందుకు ఓఎంసీలు నిరాకరించాయి. ఇదిలావుండగా, ఇండియాలో పెట్రోలు, డీజెల్ ధరలను విక్రయిస్తున్న ప్రైవేటు సంస్థలైన ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఇప్పటికే డైనమిక్ మోడల్ లోకి ప్రవేశించి, రోజువారీ ధరా మార్పును అమలు చేస్తున్నాయి.

అయితే ఈ విధానంతో వాహనదారులకు మేలు జరుగుతుందా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పెట్రోల్ బంకులు రేట్లు పెరిగినప్పుడు మాత్రం ఉన్నఫళంగా రేట్లను పెంచుతారని, అయితే ఇదే రేట్లు తగ్గిన తరుణంలో మాత్రం పాటించరని దీంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడకతప్పదని అందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరల విషయంలో ఇక వాహనదారులకు.. పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు మధ్య రోజువారీగా ఘర్షణలు జరుగుతాయన్న అందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles