ఆపరేషన్ థియేటర్ లో ఫెషెంట్ ముందే ఛీ.. ఛీ... | Medics dancing around patient preparing for surgery.

Medics dance around and mock patient before surgery

Medics Dance Video, Medics Operation Surgery Table, Colombia Hospital Video, Doctors Dance Video, Operating Theater Dance Video, Colombia Hospital Operating Theater Dance

In shocking viral video, medics dance around and mock patient before surgery. After huge backlash in social media Medics fired.

ITEMVIDEOS:పెషెంట్ ముందే డాక్టర్ల పిచ్చి పనులు

Posted: 03/31/2017 08:05 AM IST
Medics dance around and mock patient before surgery

ఒక ఆస్పత్రిలో, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్ దగ్గర ఎంత అప్రమత్తంగా ఉంటారో సాధారణంగా చూస్తుంటాం. అత్యవసర పరిస్థితిలో వచ్చే ఫెషెంట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఇక్కడ జరిగిన ఓ ఘటన మాత్రం బహుశా ఎక్కడా ఇంత వరకు జరిగి ఉండకపోవచ్చు. ప్రాణాలు పోసే డాక్టర్లు పరాచికాలు ఆడిన ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. ఇంతకీ వారేం చేశారో చూడండి.

కొలంబియాలోని బొలివర్ శాంతాక్రూజ్ డీ బోకాగ్రాండ్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఉదంతం వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాలినగాయాలతో ఆస్పత్రికి వచ్చిన ఓ ఫెషెంట్ కు ట్రీట్ మెంట్ చేయటం మానేసి ఇదిగో ఇలా పిచ్చి గంతులు వేశారు ఐదుగురు మహిళా వైద్యులు. పైగా ఆ వీడియోను తిరిగి సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పలువురు తీవ్ర స్థాయిలో
మండిపడుతున్నారు.

ఇక ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్పత్రి అధికారులు వారిపై వేటు వేశారు. సర్జరీ సమయంలో పేషేంట్‌కు ఇబ్బంది కలిగించటం, ట్రీట్ మెంట్ సందర్భంగా నైతిక నియమావళి పాటించకపోవటం తదితర కారణాలతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Columbia Hospital  Doctors Dance  Operating Theater  

Other Articles