కూల్ ఐస్ క్రీమ్ సంస్థల మధ్య హాట్ యాడ్ వార్.. Ice cream ad: HUL takes Amul to court

Ice cream ad hul takes amul to court

Hindustan Unilever (HUL), Vadilal Group, Amul, ice cream, television commercial, Bombay high court, Gujarat Cooperative Milk Marketing Federation, GCMMF, ice cream advt war, advertisement war, tv ad war

At the onset of summer season, ice cream and frozen dessert makers locked in a legal battle. Hindustan Unilever and Vadilal Group have joined forces to take on "Amul" ice cream over a television commercial.

కూల్ ఐస్ క్రీమ్ సంస్థల మధ్య హాట్ యాడ్ వార్..

Posted: 03/25/2017 04:47 PM IST
Ice cream ad hul takes amul to court

నిప్పుల సెగలు కక్కుతున్న వేసవి భానుడి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ దేశ ప్రజలకు భరోసా ఇస్తున్న చల్లచల్లని ఐస్ క్రీమ్ కంపెనీల మధ్య హాట్ హాట్ వార్ నడుప్తుంది. ఏకంగా దుమ్మెత్తిపోసుకునే స్థాయి వరకు వెళ్లాయి, అంతేకాదు అందరిలా తాము కాదంటూ టీవీలలో ప్రయోజిత ప్రకటనలను గుప్పించేస్థాయికి కూడా వెళ్లారు. ఇక అంతటితో అగకుండా మీరే న్యాయం చేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఇంతకీ ఏయే ఐస్ క్రీమ్ కంపెనీల మధ్య ఈ వార్ నడుస్తుందో తెలుసా..? అసలు ఈ యుద్దానికి అజ్యం పోసింది ఎవరు..? ఎక్కడ నుంచి ఈ యుద్దం ప్రారంభమైంది..? ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే సంస్థలు ఒక్కసారిగా న్యాయపోరాటం చేసే వరకు ఎందుకు వెళ్లాయో తెలుసా..? గుజరాత్ కోఆపరేటివ్ మిల్స్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని అమూల్ కంపెనీ ఉత్ప‌త్తి చేసే ఐస్ క్రీమ్ నుంచి ఈ వార్ ప్రారంభమైంది. మరోలా చెప్పాలంటే ఈ వార్ కు అజ్యం పోసింది కూడా అముల్ కంపెనీ ఐస్ క్రీం.

అముల్ ఉత్పత్తి చేసే ఐస్ క్రీమ్ ను ప్ర‌మోట్ చేసుకునే క్ర‌మంలో టీవీలో ఓ క‌మ‌ర్షియ‌ల్ ప్రాజయోజిత ప్రకటనను ప్రసారం చేస్తోంది. నిజ‌మైన పాల‌తోనే అమూల్ ఐస్ క్రీం త‌యార‌ు అవుతోంద‌ని ఇత‌ర ఐస్‌క్రీం కంపెనీలు వెజిటెబుల్ ఆయిల్ వినియోగిస్తున్నారని అమూల్ యాడ్‌లో చెప్ప‌డంపై హిందుస్తాన్ లీవ‌ర్ తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. తక్షణం ఈ ప్రకటనను నిలిపివేసేలా ఆదేశాలివ్వాల‌ని బాంబే హైకోర్టును హిందుస్తాన్ లీవ‌ర్ అశ్రయించింది. ఇందుకు వాడిలాల్ ఐస్ క్రీం సంస్థ కూడా మద్దతు తెలిపింది.

అముల్ త‌మ యాడ్‌ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోందంటూ తమ పిటీషన్ లో పేర్కోంది. హిందుస్తాన్ యూనీలివ‌ర్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తున్న క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీంలో వ‌న‌స్ప‌తి నూనెను వాడ‌టం లేద‌ని పాల ఉత్ప‌త్తుల‌నే వాడుతున్న‌ట్లు హిందుస్తాన్ యూనీలివ‌ర్ స్ప‌ష్టం చేసింది. అయితే డెయిరీ ఉత్ప‌త్తుల‌తో పోలిస్తే వెజిటెబుల్ ఆయిల్స్‌లో వినియోగం అరోగ్యకరమని, వాటిలో క్రొవ్వు ప‌దార్థాలు తక్కువుంటాయని హెచ్ యు ఎల్ వాదిస్తుంది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindustan Unilever  Vadilal Group  Amul  ice cream  television commercial  Bombay high court  

Other Articles

Today on Telugu Wishesh