చిన్నమ్మ లేక సెల్వం... తేడా వస్తే ఇద్దరికీ కాకుండా పోతుందంట! | OPS or Sasikala Who will get the AIADMK symbol.

Aiadmk factions brace for ec hearing today

AIADMK Party Symbol, O Panneerselvam Sasikala AIADMK, AIADMK chief Election Commission, Two Leaves Symbol, Party Symbol, Two Leaves Panneerselvam, Two Leaves Sasikala, Party Symbol CEC, Tamil Nadu Party Symbol, Jayalalithaa Party Symbol

AIADMK Sasikala faction stakes claim to two leaves symbol, O Panneerselvam camp submits affidavits from party cadre. Both groups to meet CEC on Wednesday. EC to hear OPS, Sasikala factions' final pitch for party symbol. In any circumstances EC may freeze AIADMK symbol.

సెల్వం, శశికళకు ఇదే లాస్ట్ ఛాన్స్

Posted: 03/22/2017 08:01 AM IST
Aiadmk factions brace for ec hearing today

పార్టీలో జరిగిన అంతర్గత కలహాలు వాటి చిహ్నంపై పడటం మొన్న యూపీ ఎన్నికలకు ముందు ఎస్పీ పార్టీలో జరిగిన ముసలంతో చూశాం. సైకిల్ కోసం తండ్రి కొడుకులిద్దరూ పోటాపోటీగా కొట్టుకోగా, చివరకు అఖిలేష్ కే ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. ఇక ఇప్పుడు ఆ సీన్ తమిళనాడుకు షిఫ్ట్ అయ్యింది. జయలలిత మరణంతో ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభం, పన్నీర్ తిరుగుబాటు, శశికళ వర్గీయుడే సీఎం కావటం తదితర పరిణామాలు విదితమే.

అమ్మ మరణంతో ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ ఉపఎన్నిక కోసం అన్ని పార్టీలు పోటాపోటీగా సిద్ధమౌతున్నాయి. ఈ నేపథ్యంలో రెండాకుల గుర్తు కోసం పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ గ్రూప్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఈసీని ఆశ్రయించాయి. అన్నాడీఎంకే ఎన్నికల గుర్తైన రెండాకులను ఎవరికి కేటాయించాలన్న దానిపై నేడు (బుధవారం) సీఈసీ నిర్ణయం తీసుకోనుంది.

కనీసం సింబల్ అయినా తాను దక్కించుకోని ప్రజల్లోకి తానే అమ్మ పార్టీకి అసలైన వారసుడినని సంకేతాలు పంపాలని ఓపీఎస్ పట్టుదలగా ఉన్నాడు. చిన్నమ్మకు చెక్ పెట్టేలా వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నాడు. తమ వద్ద ఉన్న ఆధారాలను, రికార్డులను ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్ కు సమర్పించింది కూడా. శశికళ అనుచరులు కూడా తమదే అసలైన పార్టీ అని చెబుతూ తమ వాదనతోపాటు కొన్ని సాక్ష్యాలను కూడా అందజేసింది. దీంతో చివరగా మరోసారి వాదనలు విననున్న సీఈసీ ఆపై ఎలాంటి నిర్ణయం వెలువరచించబోతున్నాడా? అన్న దానిపై తమిళనాడు సహా దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు తేడా వస్తే మాత్రం సింబల్ ను ఫ్రీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Two Leaves  AIADMK Symbol  Election Commission  OPS  Sasikala  

Other Articles