గిన్నిస్ బుక్ లో రాహుల్ గాంధీ పేరు... ఏం పొడిచాడని? | Why Rahul may make it to the Guinness Book of World Records.

Rahul gandhi name proposed to guinness book

Congress Vice President, Rahul Gandhi, Guinness Book, Rahul Name Guinness Book, Rahul Gandhi 27 Election Lost, Rahul Gandhi New Record, MP Student Rahul Gandhi, Engineering Student Rahul Gandhi, Rahul Gandhi Record Lost, Vishal Diwan Rahul Gandhi

Madhya Pradesh Engineering student proposes Congress Vice President Rahul Gandhi's name in Guinness Book of World Records for losing 27 elections.

గిన్నిస్ బుక్ లో రాహుల్ గాంధీ!!!

Posted: 03/21/2017 03:58 PM IST
Rahul gandhi name proposed to guinness book

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయుడు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అరుదైన ఘనత దక్కబోతుందా? గిన్నిస్ బుక్ లో యువరాజు పేరు లిఖించబోతున్నారా? అసలు అంత అర్జంటుగా ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ రాహుల్ ఏం చేశాడని అంటారా? ఈ డిమాండ్ చేస్తుంది ఏ రాజకీయ నేతో కాదు లేండి. మధ్యప్రదేశ్, హోషంఘబాద్ కు చెందిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్. అలాగని అతగాడు రాహుల్ వీరాభిమాని కూడా కాదు.

ఇంతకీ విశాల్ ధావన్ అనే ఆ విద్యార్థి చెబుతోంది ఏంటంటే ఓటములతో రాహుల్ ఈ ఘనత సాధించాడంట. అవును.. వరుసగా 27 ఎన్నికల్లో ఓటమి పాలవ్వటం ద్వారా రాహుల్ కొత్త రికార్డు నెలకొల్పాడని, అందుకే ఆయన పేరును గిన్నిస్ బుక్ లో చేర్చాలని గిన్నిస్ బుక్ వాళ్లకు అతగాడు ఓ సందేశం పంపాడు. ప్రపంచంలో మరెవరూ ఇన్ని ఎన్నికల్లో ఓడిపోలేదని, ఎవరైనా ఓడివుంటే, ఆ విషయాన్ని తెలియజేయాలని, అందుకు సంబంధించి ప్రోసెసింగ్ ఫీజు కూడా చెల్లించాడు.

అతని మెసేజ్ అందినట్లు గిన్నిస్ బుక్ వాళ్ల నుంచి ధృవీకరణ రాగా, సమాధానం రావటానికి మాత్రం కాస్త సమయం పట్టేలా ఉంది. వరుసగా తగులుతున్న ఓటముల నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీ క్రమంగా దేశంలో కనుమరుగు అయ్యే స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాహుల్ బాధ్యత వహించిన 2014 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పాలిత ప్రాంతాలను కూడా బీజేపీకి అప్పజెబుతూ వస్తోంది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్ గ్రాండ్ విక్టరీ మినహా పెద్దగా ఉపశమనం దక్కలేదు. ఇప్పటికే రాహుల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతుండగా, ఈ గిన్నిస్ ఫీట్ మరెంత తలనొప్పి తెచ్చిపెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Congress  Vice President  Rahul Gandhi  27 Lost  Guinness Book Record  

Other Articles