ప్రకటించింది లక్షా 25 వేల కోట్లు.. విధిల్చింది పైసా లేదు 18 months on, Bihar yet to receive PM’s Rs 125,000 cr package

18 months on bihar yet to receive pm s rs 125 000 cr package

Financial packages, Bihar assembly elections, Narendra Modi, Finance Ministry, Election promises, RTI query, Anil Galgali, Anand Parmar, Modi’s assurances

Even 18 months after the Bihar assembly elections held in October 2015 , the state still awaits a sum of Rs 1.25 lakh-crore announced by PM Modi during the poll campaign

ప్రకటించి 18 నెలలు కావస్తున్నా.. పైసా రాలేదు

Posted: 03/07/2017 07:58 PM IST
18 months on bihar yet to receive pm s rs 125 000 cr package

ఎన్నికలకు ముందు నాయకులు తమ నోటికి వచ్చిన హామీలను గుప్పిస్తారన్న విషయం తెలిసిందే. అందులో అచరణ సాధ్యమైనవి, కానివి కూడా వుంటాయి. అయినా సరే చేస్తాం.. అధికారాన్ని ఇవ్వండీ చేసేస్తాం అంటూ బల్లగుద్ది మరీ చెబుతారు. ప్రజలను పక్కదారి పట్టిస్తారు. అయితే ఇదోదే సాధారణ నాయకుడు చేస్తే పర్వాలేదు కానీ.. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్రమోదీ ఇలాంటి హామీనే గుప్పించి ఆనక చేతులెత్తేస్తే.. ప్రజలు విశ్వసించడం.. కుప్పలు తెప్పలుగా ఓట్లను వేయడం అన్ని జరిగిపోతాయి. ఆ తరువాత హామీని నిలబెట్టుకోకపోతే.. ఇదే జరిగింది.

ప్రధాని మోడీ తన హయంలో ఇచ్చిన అతి పెద్ద ప్యాకేజీ హామీ ఏకంగా లక్షా 25వేల కోట్లు. అర్థికంగా వెనుకబడిన రాష్ట్రం బీహార్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో అఘమేఘాల మీద ప్రధాని ఈ హామిని బీహార్ రాష్ట్రానికి వెళ్లి మరీ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు.  అయితే ఈ ప్రకటన చేసి దాదాపు ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పైసా కూడా విడుదలవ్వలేదంట. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చింది. ముంబయికి చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమ కారుడు అనిల్‌ గల్గాలి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్టీఐ దరఖాస్తు చేశారు.

అందులో ప్రధాని మోదీ చేసిన అతిపెద్ద హామీ ఏది అని, ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటీ అని అందులో ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆనంద్‌ పర్మార్‌ నేరుగా సమాధానం ఇచ్చారు. ‘బిహార్‌ ఎన్నికల ప్రచారం సమయంలో ఆ రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించి దాని పురోభివృద్ధికై మోదీ ఆగస్టు 18, 2015న రూ.1,25,003కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దశాల వారిగా నిధులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఒక పైసా కూడా విడుదల చేయలేదని చెప్పారు’  అని అనిల్‌ గల్గాలి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles