బానిసలుగా చూస్తున్నారంటూ జవాను వీడియో.. వైరల్ After Tej Bahadur, jawan Sindhav Jogidas posts shocking video

Army officers treating sahayaks as slaves says jawan

Sahayak System, Sahayak, Sindhav Jogidas, Jawan Sindhav Jogidas, PMO India, PMO, Defence Ministry, BSF Jawan, punishment, Jawan harassed, Sahayak job

After BSF jawan Tej Bahadur, Jawan Sindhav Jogidas reaches out for help through a video message, Who is being forced to be Sahayak and do menial jobs as punishment for joining late.

ITEMVIDEOS: బానిసలుగా చూస్తున్నారంటూ జవాను వీడియో.. వైరల్

Posted: 03/07/2017 07:20 PM IST
Army officers treating sahayaks as slaves says jawan

దేశప్రజల ప్రాణాలను సరిహద్దులో వుండి కాపాడుతున్న ఆర్మీ అంటే వారేదో సాహసాలు చేసినప్పుడో, ప్రకృతి విపత్తులలో సాయం చేసినప్పుడో, లేక యుద్దంలో గెలిచినప్పుడో కాదు, వారు కనిపించగానే కరతాళధ్వనులతో వారికి గౌరవ సూచకాన్ని తెలియజేయాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే అదే ఆర్మీలో సేవలందిస్తూ.. తాము కనీసం మంచి బోజనానికి కూడా నోచుకోలేకపోతున్నామని చెప్పిన తేజ్ బహదూర్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తనను పాకిస్థాన్ తో లింకుపెట్టి మరీ మనోవేధనకు గురిచేస్తున్నారని చెప్పడం అందోళనకు గురిచేస్తుంది.

ఈ తరుణంలోనే సహాయక్‌ విధానంలో సమస్యలు బయటపెట్టిన సైనికుడు రాయ్‌ మాథ్యూ అనుమానాస్పందంగా మృతిచెందిన ఘటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనను మరవకముందే.. మరో జవాను తన ఆవేదనను చెప్పేందుకు ముందుకొచ్చాడు. సహాయక్‌ ఉద్యోగం అంటే సైనికులకు శిక్ష లాంటిదేనంటూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ విధానానికి వ్యతిరేకంగా సింధవ్‌ జోగిదాస్‌ అనే జవాను మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

ఆర్డర్లీ పనిచేసే జవాన్లను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. సెలవుల నుంచి ఆలస్యంగా వచ్చినందుకు తమను దారుణంగా శిక్షిస్తున్నారని జోగిదాస్‌ అన్నాడు. ఈ విషయాలపై ఫిర్యాదులు చేసినా కూడా తమను శిక్షిస్తారని చెప్పాడు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు కూడా స్పందించడంలేదన్నాడు. ‘సహాయక్‌ ఉద్యోగం చేయనని చెప్పినప్పటి నుంచి అధికారులు నన్ను వేధిస్తున్నారు. నన్ను ఏడు రోజుల పాటు ఆర్మీ కస్టడీలో ఉంచారు’ అంటూ జోగిదాస్‌ వీడియోలో మాట్లాడాడు.

అనుమానాస్పదంగా మృతిచెందిన రాయ్‌ మాథ్యూ ఘటన తర్వాత ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆర్మీలో సహాయక్ అన్న పదం కేవలం శిక్ష విధించడానికేనన్న జోగిదాస్ వీడియోతో ఉన్నతాధికారులు జూనియర్లతో చేయిస్తున్న పనులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సైన్యంలో అధికారుల ఇళ్ల వద్ద జవాన్లు పనులు చేసే సహాయక్‌(ఆర్డర్లీ) విధానంపై ఓ వార్తాపోర్టల్‌ జరిపిన శూలశోధనలో రాయ్‌ మాట్లాడి.. సమస్యలను బయటపెట్టాడు. అయితే కొద్ది రోజులకే రాయ్‌ అనుమానాస్పద మత్యువాత పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles