వార్నీ ఈ వరుడి వెర్రి కూడా ఇప్పుడు వైరల్..! Groom's WWE-Style Wedding Entrance Is A Must Watch

Groom s wwe style wedding entrance is a must watch

Pakistani groom, wedding entry, WWE, Triple H, Lahore, Pakistan Daily, Pakistan Films, Pakistani Wedding

A groom from Pakistan made the most dramatic entry at his wedding. Kichoo Ahmer from Lahore entered the venue with the theme song of WWE wrestler Triple H playing in the background.

ITEMVIDEOS: వార్నీ ఈ వరుడి వెర్రి కూడా ఇప్పుడు వైరల్..!

Posted: 03/07/2017 07:07 PM IST
Groom s wwe style wedding entrance is a must watch

పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నది నానుడి తెలిసిందే. అలాగే ఎవరి పిచ్చి వారికి ఆనందమనే నానుడి వుండనే వుంది. ఇప్పుడు ఇవి ఎందుకు చెబుతున్నామని అలోచనలో పడ్డారా.? ఈ వరుడి వెర్రిని చూసిన తరువాత మీరు కూడా ఇలానే అంటారనుకుంటా. అదేంటి అతనేం చేశాడంటారా..? తన పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధువరులందరూ అశిస్తారు. అయితే వారికున్న అర్థిక పరిమితుల నేపథ్యంలో తమ స్థాయికి తగ్గట్టుగా నిర్వహించుకుంటారు. అయితే ఈ వరుడు మాత్రం తాను అందరికీ విభిన్నమని రుజువు చేశాడు.

పాకిస్థాన్ లాహోర్ కు చెందిన వరుడు పెళ్లికి వచ్చిన అతిధులను అశ్చర్యంలో ముంచెత్తాడు. పెళ్లికి హాజరయ్యేందుకు తాను చేసిన ఏర్పాట్లు చర్చనీయంశంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లాహోర్ కు చెందిన కిచ్చో అహ్మర్ తన పెళ్లిలోకి ఎంటీ ఇచ్చేందుకు గాను వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. అచ్చంగా డబ్యూ డబ్యూ ఈ లో ఛాంపియన్ షిఫ్ బెల్ట్ తరహాలో ఓ బెల్టుతో వేదికపైకి వచ్చాడు. అతను వస్తుండగా, ఈ వేదికపై ఫైర్ వర్స్క్ కాలుతుండగా వచ్చిన వరుడు నేరుగా మాక్ రింగ్ లోకి ప్రవేశించాడు. అయితే తాడుకు బదులు పూలదండలతో రింగ్ ఏర్పాటు చేసివుండటం గమనార్హం.

ఇక పటాసుల వెలుతరుల మధ్య వరుడు వేదికపైకి చేరుకుంటున్న సమయంలో ట్రిపుల్ హెచ్ డబ్యూడబ్యూఇ వేదికలోకి వస్తుండగా, ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆచ్చంగా ట్రిపుల్ హెచ్ తరహాలో ఆయన చేసిన సిగ్నేచర్ ఫోజు, వాటర్ స్పిట్టింగ్ మూవ్ మెంట్తో పెళ్లికి హజరైన అతిధులందరూ వినూత్న అనుభవాన్ని పోందారు. సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోను సర్కాస్మిస్తాన్ అనే సేజి ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయగా, దానికి ఇప్పడు లక్షల సంఖ్యలో లైకులు వస్తున్నాయి. వరుడి వెర్రికి అతిధులు ఉబ్బితబ్బిబ్బు కాగా, ఈ వీడియో మాత్రం నెట్ లో హల్ చల్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistani groom  wedding entry  WWE  Triple H  Lahore  Pakistan Daily  Pakistan Films  Pakistani Wedding  

Other Articles

Today on Telugu Wishesh