టెక్నికల్ కారణాలు.. కమలం కురు వృద్ధుడిని కాపాడలేవు.. ఆయన పని అంతే! | Won't Accept Dropping Of Charges Against LK Advani On Technical Grounds.

Sc on advani name in babri masjid demolition case

LK Advani, Babri Mosque Demolition Case, Supreme Court LK Advani, Supreme Court Babri Mosque Case, Murli Manohar Joshi Uma Bharathi LK Advani, CBI LK Advani, Advani Name Babri Case

Senior BJP leader LK Advani and other BJP leaders may face trial in the decades-old Babri mosque demolition case, the Supreme Court indicated today. The court's order on March 22 will reveal whether or not Mr Advani, 89, and other leaders like Murli Manohar Joshi and Union Minister Uma Bharti will be on trial for conspiracy, a charge that was dropped by lower courts.

అద్వానీ పని ఇక అయిపోయినట్లేనా?

Posted: 03/06/2017 06:24 PM IST
Sc on advani name in babri masjid demolition case

కమలం కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి బాబ్రీ మసీదు ధ్వంసం గండం తప్పేలా లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు సంకేతాలు కూడా పంపింది. పార్టీ మరో సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, ప్రస్తుతం కేంద్రమంత్రిగా పనిచేస్తున్న ఉమాభారతీ, ఇతర బీజేపీ నాయకులు మసీదు ధ్వంసానికి సంబంధించి కుట్ర చేశారనే ఆరోపణలు ఎదుర్కోనున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో అద్వానీసహా కీలకనేతలకు ఊరటనిస్తూ 2010 లో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది.

సాంకేతిక కారణాలతో అద్వానీని, ఇతరుల పేర్లును తొలగించేందుకు వీలు లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఇక ఈ నెల (మార్చి)22న బాబ్రీ మసీదు ధ్వంసానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇదే చివరి విచారణ కానుందని, ఆ రోజు బీజేపీలో కొందరు సీనియర్‌ నేతలు ఇంకొందరు కచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్నో, రాయబరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎల్‌కే అద్వానీ, ఉమాభారతీకి బాధ్యులుగా పేర్కొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

1992, డిసెంబర్‌ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతంలోనే వివరణ ఇవ్వాలంటూ అద్వానీ, ఉమా భారతీ, మరో 19మంది నేతలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మొత్తం రెండు కేసులు నమోదుకాగా ఒక దాంట్లో రామ్ కథా కుంజ్ వేదికపై ఉన్న అద్వానీతోపాటు కీలకనేతలపై , మరో దాంట్లో విధ్వంసంలో పాల్గొన్న లక్ష మంది కరసేవకులపై కేసులు నమోదు అయ్యాయి. మరణించటంతో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పేరును నిందితుల జాబితా నుంచి తొలగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Babri Mosque Demolition Case  Supreme Court  LK Advani  CBI  

Other Articles