మామూలు 'షాక్' కాదు.. అయినా ఎలా బతికాడో తెలుసా? | African man surviving after huge shock.

Man hit with high voltage shock manages to walk away

Electricity Pylon Video, High Voltage Shock, Man High Voltage Shock Video, Electricity Pylon Man, Man Fall Down Electricity Pylon, Shock Video, High Voltage Shock

Horrifying video shows man dropping from 100ft electricity pylon after being electrocuted twice - and surviving.

ITEMVIDEOS:అంత ప్రమాదం.. అయినా అలా ఎలా బతికాడు

Posted: 03/06/2017 02:56 PM IST
Man hit with high voltage shock manages to walk away

అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది... అదే గాచారం బాగుంటే ఎంత ఘోరం నుంచైనా తాపీగా తప్పించుకోవచ్చు. సరిగ్గా ఓ ఆఫ్రికన్ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. అదోక హైటెన్షన్ టవర్... 100 అడుగులపైనే ఎత్తు.. పైగా 30 వేల వోల్టుల విద్యుత్ తీగలు.

ఎక్కడ జరిగిందో? ఎందుకు ఎక్కాడో? సరిగ్గా తెలీదు కానీ, ఆ తీగలను తాకాడు. ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తు నుంచి పిట్టలా కిందపడ్డాడు. ఆ క్రమంలో హైవోల్టేజ్ వైర్లను రెండు సార్లు తాకాడు. మంటలు ఒక్కసారిగా లేవటంతో అతని పని అయిపోయిందని అంతా అనుకున్నారు. పైగా అంత ఎత్తు నుంచి కిందపడితే ఏమైనా ఉంటుందా?.

 

కానీ, కట్ చేస్తే సీన్ అలా లేదు. అతగాడు లేచి నడుచుకుంటూ అటు ఇటు తిరిగాడు. కేవలం అతని దుస్తులు మాత్రమే కాలిపోయి ఒంటి నిండా గాయాలతో కనిపించాడు. కానీ, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందో మాత్రం తెలీదు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూస్తే నిజమైన మృత్యుంజయుడని అనుకోవటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Electricity Pylon  Man Shock Video  Survive  

Other Articles