కేఎల్ రాహుల్ మినహా మళ్లీ విలవిలలాడిని విరాట్ కోహ్లీ సేన.. India all out for 189 in Bangalore test, Nathan Lyon picks 8/50

India all out for 189 in bangalore test nathan lyon picks 8 50

australia,india,virat kohli,steven peter devereux smith,m.chinnaswamy stadium bengaluru,australia tour of india 2017,cricket,live cricket score

India vs Australia: KL Rahul was the only saving grace as the hosts bundled out for 189 on Day 1 of the Bengaluru Test against Australia. Nathon Lyon was pick of the bowlers who took 8 wickets for 50 runs in 22.2 overs.

కేఎల్ రాహుల్ మినహా మళ్లీ విలవిలలాడిని విరాట్ కోహ్లీ సేన..

Posted: 03/04/2017 03:43 PM IST
India all out for 189 in bangalore test nathan lyon picks 8 50

ఆస్ట్రేలియాతో పూణే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఎదురైన దారుణ ప్రధర్శనను మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని హామి ఇచ్చిన 24 గంటల లోపు మరో మారు అదే తరహా పరాభవం విరాట్ సేనకు ఎదురైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మినహా టీమిండియాకు చెందిన ఏ ఒక్క అటగాడు కూడా అకట్టుకోలేకపోయాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో అసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత్ జట్టు విలవిల్లాడింది. తన తొలి ఇన్నింగ్స్ లో 71.2 ఓవర్లలో 189 పరుగులకే చాపచుట్టేసింది.ఎనిమిది వికెట్లు సాధించిన లియన్ టీమిండియా పతనాన్ని శాసించాడు.

ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ను ఎదుర్కోలేక కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శనివారం ఆరంభమైన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 189 పరుగులకే అల్ ఔట్ అయ్యింది. దీంతో పర్యాటక జట్టు ముందుకు 190 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒక్క ఇన్నింగ్స్ లో ఎనమిది వికెట్లలో లయన్ కే భారత బ్యాట్స్ మెన్లు సమర్పించుకున్నారు.  భారత ఆటగాళ్లలో అభినవ్ ముకుంద్(0), చటేశ్వరా పూజారా(17), విరాట్ కోహ్లి(12), రహానే(17), కరుణ్ నాయర్(26),అశ్విన్(7), వృద్ధిమాన్ సాహా(1) లు పెవిలియన్ కు చేరి తీవ్రంగా నిరాశపరిచారు.

తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తరువాత రెండో సెషన్ లోపు మరో మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై మూడో సెషన్ ఆదిలో మరో రెండు వికెట్లను చేజార్చుకుంది. ప్రధానంగా అరవై పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను చేజార్చుకోవడంతో భారత్ మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. ఇదిలా ఉంచితే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాట్ సాగిస్తున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. తొలిటెస్టు కన్నా దారుణ స్కోరుకే పెవిలియన్ కు చేరిన టీమిండియా.. ఈ సారి బెంగుళూరు పిచ్ బాగోలేదని అరోపిస్తారోమోనన్న విమర్శలు కూడా క్రికెట్ అభిమానుల నుంచి వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh