అమెరికాలో బండ బూతులు తిట్టించుకుంది ఈ యువతేనా? | Indian-origin girl respond on racially abused in US.

Indian origin girl harassed on train in new york

Ekta Desai, Ekta Desai Insult Video, Ekta Desai America, Ekta Desai Video, Indian Girl America, Indian Girl Assault America, Indian Origin Girl Metro Train, Metro Train Assault Video, Indian Girl Racially Abuse, Hate Crime Indian Girl, New York Indian American Woman, Ekta Desai Physiotherapist

Indian-origin physiotherapist racially abused in New York train. Ekta Desai, an Indian Origin, residing in New York harassed and assaulted by a man while she was travelling in a Metro train.

సంచలన వీడియోలో ఉన్న యువతి దొరికేసింది

Posted: 03/03/2017 08:33 AM IST
Indian origin girl harassed on train in new york

ఓవైపు అమెరికాలో జాతి వివక్ష దాడుల గురించి ఆందోళనలో భారతీయులు ఉంటే.. మరోపక్క అలాంటి ఉదంతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఓ రెండు రోజుల క్రితం మీడియాలో ఓ సంచలన వీడియో హల్ చల్ చేసింది. న్యూయార్క్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ భారతీయ యువతిని ఓ ఆఫ్రిక్-అమెరికన్ సంతతి వ్యక్తి బండ బూతులు తిడుతూ ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరిస్తూ అతగాడు అందులో రెచ్చిపోయాడు.

అయితే వీడియో వచ్చాక ఇంతకీ అది పోస్ట్ చేసింది ఎవరంటూ ఆరాలు తీయటం మొదలుపెట్టారు. చివరకు ఆ యువతే ఘటనపై రియాక్ట్ అయ్యింది . ఆమె పేరు ఏక్తా దేశాయ్. భారత సంతతికి చెందింది. స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తోంది. లోకల్ ట్రైన్‌లో ఇంటికి వెళ్తున్న తన వద్దకు వచ్చిన అమెరికన్ అసభ్య పదజాలంతో తనను దూషించాడంటూ తన సోషల్ మీడియాలో ఏక్తా పోస్ట్ చేసింది. ‘ఇక్కడికి ఎందుకొచ్చావ్?.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ’ అంటూ బెదిరించాడని ఆమె పేర్కొంది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

ఎప్పటిలాగే చెవిలో హెడ్ సెట్ పెట్టుకుని నేను ఉన్నాను. పిచ్చి పిచ్చిగా వాగుతున్న అతను తనవైపు చూపించి మాట్లాడం మొదలుపెట్టాడు. కానీ నేనేం పట్టించుకోలేదు. వెంటనే అతని ఫోటోలు, వీడియో తీశాను. అతను అసభ్యపదజాలం వాడుతున్నాడని అర్థమైంది. అయినా అతడితో వాదనకు దిగలేదని ఏక్తా తెలిపింది. తనను దూషించిన అనంతరం రైల్లోని మరో ఆసియన్ యువతి వద్దకు వెళ్లి ఆమెను కూడా అలాగే బెదిరించాడని పేర్కొంది.

ఈ ఘటన తర్వాత మానవ హక్కుల సంఘం కార్యకర్త అయిన కుందన్ శ్రీవాస్తవను కలిసిన ఏక్తా పోలీసులకు ఫిర్యాదు చేసి మొబైల్‌లో రికార్డు చేసిన వీడియోను వారికి చూపించింది. మా జాతిని, ఓ మహిళను ఇంతలా అవమానించిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుందన్ ఓ ప్రకటనలో స్థానిక అధికారులను కోరాడు. అయితే పోలీసులు ఇప్పటి వరకు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indo-American Girl  Ekta Desai  Racial Abuse Video  

Other Articles

Today on Telugu Wishesh