అమ్మ మృతిలో అదిరిపోయే ట్విస్ట్.. అపోలోలో సీసీ కెమెరాలు మిస్సింగ్ | PH Pandian alleges foul play in Jayalalithaa's Death.

Jayalalithaa was pushed down at poes garden before hospitalisation

Jayalalithaa Death, PH Pandian Sasikala, Jayalalithaa Poes Garden, Jayalalithaa Fell down, Jayalalithaa Murder, Jayalalithaa's Death, Apollo CC Cameras Jayalalithaa, Tamil Nadu Former Speaker PH Pandian, Jayalalithaa Death Date

Former Tamil Nadu assembly speaker PH Pandian, alleged that Jayalalithaa was admitted to Apollo Hospitals on September 22, 2016, after the then chief minister was pushed down by someone at her Poes Garden residence in Chennai. “Amma (Jayalalithaa) fell down after someone pushed her. Nobody knows what happened to Amma after that. A police official called an ambulance, and she was taken to hospital.” Pandian, who was one of the AIADMK leaders to oppose party general secretary VK Sasikala’s swearing-in as the chief minister, also alleged that more than 25 closed-circuit television cameras were removed from the Apollo Hospitals after Jayalalithaa’s hospitalisation.

జయను మెట్ల మీద నుంచి తోసి చంపారు

Posted: 03/03/2017 07:54 AM IST
Jayalalithaa was pushed down at poes garden before hospitalisation

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గ్రూప్ అస్సలు తగ్గటం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలంటూ రోజుకో పాట పాడుతున్నాయి. ఇప్పటికే ప‌లువురు నేత‌లు ఎన్నో అనుమానాలు వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ మరో కొత్త ఆరోపణకు దిగారు అదేంటంటే.. ఆమెకు మెట్ల మీద నుంచి తోసి చంపారని..

పోయెస్‌ గార్డెన్‌లోని వేద‌నిల‌యంలో మెట్ల మీద నుంచి ఆమెను ఎవరో కిందకు తోసేశారని పాండియన్ అంటున్నాడు. వెంటనే ఓ పోలీస్ ఆఫీసర్ పనివాళ్ల సాయంతో అపోలో ఆసుప‌త్రికి తరలించి ఆమెకు చికిత్స అందించారని చెప్పాడు. అయితే ఆమె చికిత్స పొందుతుండ‌గా అక్క‌డి నుంచి 25కు పైగా సీసీటీవీ కెమెరాలను తొలగించారని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఈ అంశంపై అపోలో యాజమాన్యం
వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సీనియర్ నేత డిమాండ్ చేస్తున్నాడు.

అంతేకాదు అమ్మ డిసెంబర్ 4 సాయంత్రం 4:30 గంటలకు మృతి చెందితే, తర్వాతి రోజున ఆమె మృతి చెందిన‌ట్టు ప్రకటించారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నా డీఎంకే అభ్యర్థుల ఏ, బీ ఫాంలపై ఆమె వేలిముద్రలను తీసుకున్న అంశాన్ని లేవనెత్తుతూ, వేరే ఇతర ఏ డాక్యుమెంట్లపైన అయినా అమ్మ వేలిముద్రలు తీసుకున్నారా? అన్న ప్ర‌శ్న‌లకు శశికళ వర్గం స‌మాధానం చెప్పాల్సి ఉందని చెబుతున్నాడు. మొత్తానికి జయలలిత మరణంపై ఇలా అనుచరులుగా ఉన్నవాళ్లే రోజుకో కొత్త ట్విస్ట్ తో అనుమానాలు వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Jayalalithaa Death  Poes Garden  PH Pandian  

Other Articles

Today on Telugu Wishesh